మెగా ‘ఇంటిలిజెంట్‌’ కత్తి మహేష్‌ సంచలన వ్యాఖ్యలు

Kathi Mahesh Comments on Intelligent Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

గత కొంత కాలంగా కత్తి మహేష్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నాడు. సోషల్‌ మీడియాలో ఆయన చేస్తున్న ప్రతి పోస్ట్‌కు విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంటుంది. అలాంటి కత్తి మహేష్‌ తాజాగా చేసిన ఒక ట్వీట్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌, వినాయక్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఇంటిలిజెంట్‌’ చిత్రం ఫస్ట్‌లుక్‌ తాజాగా విడుదలైన విషయం తెల్సిందే. ఆ ఫస్ట్‌లుక్‌కు ముందు ప్రీ లుక్‌ను విడుదల చేయడం జరిగింది. ఆ ప్రీ లుక్‌లో తేజూ చేతికి కట్టు ఉంది, ఆ కట్టు చేతితో గన్‌ పట్టుకుని ఉన్నాడు. దీనిపై కత్తి మహేష్‌ తనదైన శైలిలో విమర్శించాడు. 

కత్తి మహేష్‌ ‘ఇంటిలిజెంట్‌’ ప్రీ లుక్‌పై స్పందిస్తూ… ‘తెలివైనవాడు గాయపడిన చేతితో గన్‌ పట్టుకోవడం ఏమిటో, టైటిల్‌కు తగ్గ పోస్టర్‌ అయితే కాదు..’ అంటూ ట్వీట్‌ చేశాడు. ఇలాంటివి చాలా కామన్‌గా జరుగుతూనే ఉంటాయి. హీరోయిజం చూపించేందుకు కొన్ని సార్లు ఇలాంటివి దర్శకులు చేస్తూ ఉంటారు. అలాంటిది కత్తి మహేష్‌ దీన్ని ఎత్తి చూపి టైటిల్‌కు తగ్గ పోస్టర్‌ కాదు అంటూ ట్వీట్‌ చేయడంతో మెగా ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రతి సినిమాలో, పోస్టర్‌లో ఇలాంటివి వెదికితే లెక్కలేనన్ని దొరకుతాయి. మరి వాటిని పట్టుకోకుండా కేవలం మెగా హీరోకు సంబంధించిన చిత్రాన్ని మహేష్‌ కత్తి ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారు  అంటూ ప్రశ్నిస్తున్నారు. కత్తి మహేష్‌ మెగా మూవీని విమర్శిస్తే ఎక్కువగా పబ్లిసిటీ దక్కుతుందనే ఉద్దేశ్యంతో ఇలా చేస్తున్నాడు అంటూ మెగా ఫ్యాన్స్‌ చెప్పుకొస్తున్నారు. కత్తి వ్యాఖ్యలపై మెగా హీరో తేజూ కాని, దర్శకుడు వినాయక్‌ కాని స్పందించలేదు. 

Kathi Mahesh Comments on Intelligent Movie