కత్తి మహేష్‌ ఇష్యూ… అజ్ఞాతవాసి ఎఫెక్ట్‌

kathi-mahesh-issue-affects-agnathavasi-movie-promotions
 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

కత్తి మహేష్‌ విషయం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా ఉంది. నిన్న మొన్నటి వరకు ఇది సినిమా ఇండస్ట్రీకే పరిమితం అయ్యింది. కాని కత్తి చేస్తున్న విమర్శలు మరియు ఆయనపై పవన్‌ ఫ్యాన్స్‌ చేస్తున్న దాడి నేపథ్యంలో వివాదం ముదిరింది. కత్తి మహేష్‌ నిన్న మొన్నటి వరకు తనకు మద్దతుగా, అభిమానులను హద్దుల్లో పెడుతూ పవన్‌ ఒక ట్వీట్‌ చేస్తే తాను విమర్శలు చేయకుండా ఉంటాను అంటూ చెప్పుకొచ్చాడు. కాని తాజాగా కత్తి మహేష్‌ స్వయంగా పవన్‌ దిగి వచ్చి మీడియా ముందు మాట్లాడాల్సిందే అని, అప్పుడే తాను ఈ విషయాన్ని వదిలేస్తాను అంటూ కత్తి మహేష్‌ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

ఈ నేపథ్యంలో పవన్‌ కళ్యాణ్‌ మీడియా ముందుకు వస్తే మొదట ఎదురయ్యే ప్రశ్న కత్తి మహేష్‌ గురించి అనే విషయం అందరికి తెల్సిందే. అందుకే ‘అజ్ఞాతవాసి’ విడుదలకు సిద్దం అయిన నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు పవన్‌ మీడియా ముందుకు వచ్చి చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. పవన్‌ గత చిత్రాలకు రెండు మూడు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చేవాడు. కాని ఈ చిత్రానికి అది కూడా లేదు.

మీడియా ముందుకు వస్తే కత్తి మహేష్‌ గురించి మాట్లాడాల్సి వస్తుందేమో అని, మీడియాలో ఖచ్చితంగా ఆ విషయం చర్చకు వచ్చే అవకాశం ఉందని, ఒక వేళ మీడియా వారితో ఆ విషయం గురించి మాట్లాడవద్దని చెప్పినా కూడా అభిమానులు లేదా ప్రేక్షకులు అయినా ఆ విషయం గురించి స్పందించాలని కోరుకుంటారని, అందుకే మీడియాకే దూరంగా ఉండటం వల్ల ఎలాంటి సమస్య రాదని పవన్‌ భావిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. మొత్తానికి కత్తి మహేష్‌ వల్ల పవన్‌ మీడియా ముందుకు రావడం లేదని, అజ్ఞాతవాసి చిత్రం ప్రమోషన్స్‌పై ఎఫెక్ట్‌ పడ్డట్లుగా చెబుతున్నారు.