Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఈ మద్య కాలంలో సోషల్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో కత్తి మహేష్ గురించి ఏ రేంజ్‌లో చర్చ జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్ వివాదం తర్వాత కత్తి మహేష్ ఇచ్చే రివ్యూలపై కూడా ఎక్కువ మంది శ్రద్ద పెడుతున్నాడు. సినిమా విడుదల అవ్వడమే ఆలస్యం వెంటనే యూట్యూబ్‌లో, ఛానెల్స్‌లో కత్తి రివ్యూలు వస్తూ ఉన్నాయి. తన ట్విట్టర్ పేజీలో కూడా క్లుప్తంగా కత్తి మహేష్ సినిమా రివ్యూలు పెడుతూ ఉంటాడు. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగా ‘ఇంటిలిజెంట్’ మరియు మోహన్‌బాబు ‘గాయత్రి’లకు కత్తి మహేష్ నెగటివ్ రివ్యూలు ఇచ్చాడు. ముఖ్యంగా మెగా మూవీని చీల్చి చెండాడాడు.
‘ఇంటిలిజెంట్’ గురించి స్పందిస్తూ… 5 పాటలు శబ్ద కాలుష్యంను కలిగించేవిగా ఉన్నాయి, రీమిక్స్ పాట క్లాసిక్‌ను చెడగొట్టింది. ఆరు చెత్త ఫైట్లు, నవ్వు తెప్పించని కామెడీ సీన్స్, ప్రేమ లేని రొమాన్స్, ఏమాత్రం ఆసక్తిగా లేని కథ. మీరు కనుక ఇంటిలిజెంట్ అయితే తప్పకుండా ఈ సినిమాకు దూరంగా ఉండండి అంటూ ట్వీట్ చేశాడు.
‘గాయత్రి’ గురించి స్పందిస్తూ… ఆసక్తికర స్టోరీలైన్‌ను మంచి స్క్రీన్‌ప్లే చిత్రంగా మల్చలేక పోయారు. కథ, స్క్రీన్‌ప్లే విషయంలో దర్శకుడు రొటీన్ మార్గంలో ఆలోచించాడు. ఎమోషనల్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడంతో పాటు సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు. మోహన్‌బాబు, నిర్మల విమల్‌లు మంచి నటనతో మెప్పించారు అంటూ ట్వీట్ చేశాడు.