Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పవన్ కళ్యాణ్, కత్తి మహేష్‌ల ఇష్యూ కాస్త చల్లారినట్లుగా అనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ గురించి బాంబుల వంటి విమర్శలను కత్తి మహేష్ చేయడం లేదు. ఇటీవలే కోన వెంకట్ ఈ విషయంలో జోక్యం చేసుకుని కత్తి మహేష్‌తో స్వయంగా మాట్లాడాడు అంటూ ప్రచారం జరుగుతుంది. పవన్ నటించిన అజ్ఞాతవాసి చిత్రం విడుదల అవుతున్న నేపథ్యంలో 15వ తారీకు వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దంటూ కత్తిని కోరడం జరిగిందని, ఆ తర్వాత ఆ విషయమై పవన్‌తో ఒక ప్రకటన చేయిస్తాను అంటూ కత్తి మహేష్‌తో కోన వెంకట్ చెప్పినట్లుగా తెలుస్తోంది. దాంతో కత్తి మహేష్ కూడా కాస్త సైలెంట్‌గా ఉన్నాడు.
కత్తి మహేష్ రెండు మూడు రోజులుగా పవన్‌ను టార్గెట్ చేసి విమర్శలు అయితే చేయడం లేదు కాని, ఆయనపై పవన్ ఫ్యాన్స్ మాత్రం దుమ్మెత్తి పోస్తున్నారు. అజ్ఞాతవాసికి బ్యాడ్ రివ్యూ ఇచ్చాడు అంటూ కత్తి మహేష్‌పై పవన్ ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నారు. ఈ సమయంలోనే కాస్త ఓపికగా కత్తి మహేష్ ట్విట్టర్ ద్వారా పవన్ ఫ్యాన్స్‌కు ఈనెల 16 వరకు వెయిట్ చేయండి అంటూ స్వీట్ వార్నింగ్ ఇస్తున్నాడు. ఈనెల 16న ఏం జరగబోతుంది అనేది ప్రస్తుతం అందరిలో చర్చనీయాంశంగా ఉంది.
కోన హామీ ఇచ్చినట్లుగా స్వయంగా కత్తి మహేష్ ఇష్యూలో పవన్ స్పందిస్తాడా అనేది చూడాలి. పవన్ స్పందించవద్దని, కత్తి మహేష్ వంటి ఒక అల్పుడి విషయంలో పవన్ స్పందించడం ఏంటని పవన్ ఫ్యాన్స్ కొందరు ప్రశ్నిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజా ఈ వివాదం కత్తి మహేష్‌కు, పవన్‌కు అవసరమా అంటూ ఒక వీడియోలో ప్రశ్నించగా, కత్తి మహేష్ అందుకు సమాధానంగా తాను ఎప్పుడు కూడా ఈ వివాదాన్ని ముగించాలని కోరుకుంటున్నాను. కాని సాధ్యం కావడం లేదు. ఈనెల 16 తర్వాత అయినా ఈ వివాదం ఆగిపోతుందని భావిస్తున్నాను అంటూ కత్తి మహేష్ ట్వీట్ చేశాడు. దాంతో పాటు కత్తి మహేష్ ఈ ట్వీట్‌ను కూడా చేశాడు…