నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత కి నేడు ఒక ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుండి నిజామాబాద్ కి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కాగా నిజామాబాద్ లో జరగాల్సిన స్థానిక సంస్థల ఎమెల్సీ ఎన్నికలకు సంబందించిన నామినేషన్ వేయడానికని నిజామాబాద్ వెళ్తుండగా కవిత వెళ్తున్న కాన్వాయ్ కి ఈ ప్రమాదం జరిగింది. కాగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి నిజామాబాద్ కి బయలుదేరిన కల్వకుంట్ల కవిత కి సంబందించిన కాన్వాయ్ తూఫ్రాన్ వద్దకు చేరుకోగానే ముందుగా వెళ్తున్నటువంటి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కారును కవిత కాన్వాయ్‌లోని మరో కారు ఢీకొట్టింది.
కాగా ఈ ప్రమాదంలో అర్ముర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి గారి కారు నుజ్జు నుజ్జు అయింది. అయితే ఆ ప్రమాద సమయంలో ఎమ్మెల్యేతో పటు , సిబ్బంది కూడా ఎవరు లేకపోవడంతో ఎవరికీ కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే ఆ తరువాత నెమ్మదిగా నిజామాబాద్ చేరుకున్న కవిత శాసనమండలి నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా స్థానానికి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఈ ప్రమాదంలో తనకు ఎలాంటి గాయాలు కాలేదని, తనకెలాంటి ప్రమాదం జరగలేదని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రకటించడంతో తెరాస కార్యకర్తలు, అభిమానులు అందరు కూడా కాస్త సముదాయించినట్లు సమాచారం