లగడపాటి చేతిలో తెరాస ఎమ్మెల్యేల జాతకం.

kcr-who-sought-help-from-lagadapati-rajagopal-over-survey-issue

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జోరుగా నడుస్తున్న సమయంలో కెసిఆర్, లగడపాటి మధ్య ఏ స్థాయిలో యుద్ధం నడిచిందో అందరూ చూసారు. ఉప్పునిప్పులా వున్న ఆ ఇద్దరూ ఇక ఒకరితో ఒకరు ఏమి మాట్లాడుకుంటారులే అనుకుంటే…తెలంగాణ వచ్చిన కొత్తల్లోనే లగడపాటి పోరాట స్ఫూర్తిని కెసిఆర్ మెచ్చుకున్నారు. ఇక కెసిఆర్ తో చేసిన సవాల్ కి కట్టుబడి రాజకీయ జీవితాన్నే త్యాగం చేశారు లగడపాటి. తెలంగాణ వచ్చాక ఆ ఇద్దరూ పాత విషయాలు మొత్తం పక్కన పెట్టేసారు. ఇటీవల కొడుకు పెళ్లి కార్డు ఇద్దామని వెళ్లిన లగడపాటికి సీఎం కెసిఆర్ దగ్గర ఘనమైన రెస్పాన్స్ కనిపించింది. తాజాగా కెసిఆర్ కి లగడపాటితో ఇంకో అవసరం పడిందట.అదేంటో చూద్దామా . 

తెలంగాణ లో రాజకీయ పరిస్థితులని ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి అధికార తెరాస తరపున నిరంతరం సర్వేలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ తిరిగి బలం పుంజుకుంటుందన్న వార్తలు బాగా వినిపిస్తున్నాయి. ఇంకో వైపు ఎన్నికలు ముంచుకు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సర్వేల నిర్వహణ వ్యవహారాన్ని సీఎం కెసిఆర్ బాగా సీరియస్ గా తీసుకుంటున్నారు. రాజకీయ విశ్లేషకులు వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలకు, సర్వే ఫలితాలకు పొంతన కుదరడం లేదన్న అభిప్రాయం కెసిఆర్ కి వచ్చిందట. సర్వే నిర్వహణ విధివిధానాల్లో తప్పులు దొర్లుతున్నాయన్న ఆందోళనతో వున్న కెసిఆర్ ఇప్పటిదాకా సర్వే లు చేస్తున్న సంస్థలతో సంబంధం లేని కొత్త వారిని రంగంలోకి దించాలని అనుకుంటున్నారట. ఇందులో భాగంగా వివిధ ఎన్నికల్లో ఫలితాలని ముందుగానే ఊహించిన ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ సాయం కోరారట. సర్వేల నిర్వహణలో లగడపాటి క్రెడిబిలిటీ ని దృష్టిలో ఉంచుకుని కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారట. ప్రధానంగా తెరాస ఎమ్మెల్యేల పనితీరు , వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపుకి సంబంధించి లగడపాటి సర్వే సంస్థ నుంచి కెసిఆర్ నివేదికలు కోరినట్టు తెలుస్తోంది. ఇదే నిజం అయితే తెరాస ఎమ్మెల్యేల జాతకం లగడపాటి చేతిలో వున్నట్టే కదా !