Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పుడు ఆంధ్రుల దృష్టిలో హీరో గా కనిపిస్తున్నాడు. అందుకు ఓ చిన్న ఉదాహరణ నేడు తెనాలిలో జరిగిన కెసిఆర్ బర్త్ డే వేడుకలు. తెలంగాణ వచ్చిన కొత్తల్లో భూముల ధరలు పెరిగాయని అప్పట్లో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కెసిఆర్ కి పాలాభిషేకాలు చేశారు. అయితే ఇప్పుడు కూడా అలాగే చేశారు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు నిజంగా కెసిఆర్ లో హీరోని చూసి తెనాలిలో ఆయన పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఖాదర్ అనే అభిమాని ఆధ్వర్యంలో ఈ వేడుకలు చేశారు. అందుకు ప్రధాన కారణం ఏంటని అడిగితే తెలంగాణ రాష్ట్ర సాధనలో కెసిఆర్ పోరాడిన తీరే అంటున్నారు ఖాదర్.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పార్టీలు, నాయకులు విభజన హామీల మీద కేంద్రంతో జరుపుతున్న పోరులో నిజాయితీ లేదని అంటున్న ఖాదర్, ఢిల్లీ తో ఎలా పోరాడాలో కెసిఆర్ ని చూసి నేర్చుకోవాలని పిలుపు ఇస్తున్నారు. ఇది ఖాదర్ మనసులో మాట మాత్రమే కాదు. సగటు ఆంధ్రులు చాలా మంది మోడీ సర్కార్ ని నిలవేయడంలో ఆంధ్ర పార్టీలు విఫలం అయినట్టు భావిస్తున్నారు. అలాంటిది కెసిఆర్ ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఎంత కష్టపడి వుంటారో ఇప్పుడు వారికి అర్ధం అవుతోంది. అందుకే ఆయనలో వారికి హీరో, మిగిలిన ఆంధ్ర నాయకుల్లో జీరో కనిపిస్తున్నాయి.