కీలక నిర్ణయం తీసుకున్న కేసిఆర్

కీలక నిర్ణయం తీసుకున్న కేసిఆర్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహమ్మారి కరోనా వైరస్ దారుణంగా విజృంబిస్తున్న వేళ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఈ కరోనా వైరస్ ని నివారించడానికి రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ ని చాలా కఠినంగా అమలు చేయడానికి నిర్ణయించుకున్నారు. కాగా ఈ తరుణంలో రాష్ట్రము లో ఉన్నటువంటి సామాన్యులు, దినసరి కూలీలు లాక్ డౌన్ వల్ల కనీస ఆదాయం లేకుండా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరొక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నాడని సమాచారం. కాగా రాష్ట్రంలోని కూలీల వేతనాన్ని పెంచుతూ, సంబంధిత ఉత్తర్వులను కూడా జారీ చేశారు.

కాగా ఇప్పటి వరకు ఉన్నటువంటి కూలీల వేతనాన్ని 211 రూపాయల నుంచి 237 రూపాయలకు పెంచారు. కాగా ఈ పెంచిన వేతనాలు ఈ నెల 1వ తేదీ నుంచి వర్తిస్తుందని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కాగా ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి వేతనాలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే ఇలాంటి క్లిష్టతరమైన పరిస్థితుల్లో తమకోసం ఈ సంచలనమైన నిర్ణయాన్ని తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఉపాధి హామీ కూలీలు ప్రశంసలు కురిపిస్తున్నారు.