ఇవాళ కేసీఆర్ వేసే నామినేషన్ తో రాజయోగమే నట !

Kcr Nomination Muhurtham For Raja Yoga

ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సెంటిమెంట్స్‌కు ఎంత ప్రాధాన్యమిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక వాస్తు, ముహూర్తాల విషయంలో అస్సలు లెక్క తప్పనీయరు. గజ్వేల్ నుంచి తాను వేయబోతున్న నామినేషన్ కు కూడా అదే ముహుర్తం పెట్టుకున్నారు. నిజానికి కేసీఆర్ లక్కీ నెంబర్ ఆరు. కాబట్టి పదిహేనో తేదీన నామినేషన్ వేస్తారనుకున్నారు. కానీ ఆ రోజున ముహుర్త బలం కలసి రాలేదు. అందుకే ఈ సారి సంఖ్యా శాస్త్రం కన్నా.. ముహుర్త బలాన్నే నమ్ముకుంటున్నారు. ఈ రోజు అంటే బుధవారం వేంకటేశ్వర స్వామి జన్మనక్షత్రం ఉ. 11 గం నుండి మ.1 వరకు మకర లగ్నం. మ. 1.30 నుండి 2.50 గం వరకు కుంభలగ్నం ఈ రెండు ముహూర్తాలు కేసిఆర్ కు మరో సారి రాజయోగం వస్తుందని పండితుల సూచనలు మ.2.30 నిమిషాల ముహూర్తాన్ని ఖరారు చేసుకున్న కేసిఆర్. ఇదే ముహూర్తంలో నామినేషన్ వేస్తే కేసిఆర్ తో పాటు మొత్తం పార్టీ అబ్యర్థులకు శుభం చేకూరుస్తుందని నమ్ముతున్నారు.

CM KCR to visit Konaipally Venkateswara Swamy Temple

అదీ కాక ఆయనకు మరో సెంటిమెంట్‌ను కూడా అనుసరిస్తూ వస్తున్నారు. 1985 నుంచి నామినేషన్ వేసేందుకు వెళ్లిన ప్రతీసారి ఆయన సిద్ధిపేట నంగునూర్ మండలంలోని కూనాయిపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని నామినేషన్ పత్రాలు స్వామివారి పాదాల వద్ద ఉంచి వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్న అనంతరం నామినేషన్ దాఖలు చేస్తూ వస్తున్నారు. ఈరోజు కూడా ఆయన హెలికాప్టర్‌లో కోనాయిపల్లికి వెళ్లి పూజలు చేసి అక్కడి నుంచి గజ్వేల్‌కు వెళ్తారు. అక్కడ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేయనున్నారు.

KCR

మామూలుగా అయితే కేసిఆర్ లక్కీ నెంబర్ 6 అయితే 15 న నామినేషన్ కు ముహూర్త బలం లేకపోవడంతో 14న మ. 2.30 నిమిషాలకు నామినేషన్ వేసేందుకు రెడీ అయ్యారు. 16న అక్షయ నవమి, అష్టమి కలిసి వచ్చిన రోజు ఇది కూడా నామినేషన్లకు మంచిదే అని చెప్పారట. కానీ అదనంగా ప్రచార బాధ్యతలు ఉన్నాయి కాబట్టి అన్నీ లెక్కలు చూసుకుని ఈ రోజే నామినేషన్ వేస్తున్నారు. అయితే ప్రజలు మాతం కేసీఆర్ ముహూర్తాల పిచ్చి చూసి నవ్వుకుంటున్నారు. అయినా ఎన్నికలే కాదు ఎక్కడయినా  గెలుపోటములని డిసైడ్ చేసేది స్వయం కృషి, పట్టుదల, క్వాలిటీ ఆఫ్ వర్క్ అనే విషయం ఎప్పటికి అర్ధమేయ్యేనో ఏమో ?