తెలంగాణ ఎన్నికల స్పెషల్: 30 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్న బీజేపీ

BJP Releases 3rd List Of Candidates For Election

జాతీయ పార్టీ అయిన బీజేపీ రాబోవు తెలంగాణ ఎన్నికల సమరంలో ఒంటరి పోరుకే సిద్ధమవుతుంది. ఇప్పటికే తన తొలి జాబితాలో 38 మంది అభ్యర్థులను, రెండవ జాబితాలో 28 మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ ఈరోజు అనగా నవంబర్ 14 న మూడవ జాబితాను విడుదలచేసేందుకు యోచన చేస్తుంది. ఈ మూడవ జాబితాలో 30 మంది అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. తెలంగాణ లోని 10 జిల్లాలో గల మొత్తం 119 నియోజకవర్గాలకు డిసెంబర్ 7 న పోలింగ్ జరగనున్నట్లు తెలిసిందే. కానీ, తెలంగాణ లో అంతగా ప్రాభల్యం లేని బీజేపీ ఒంటరి పోరుకే మొగ్గుచూపడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం.

bjp-party

ఇప్పటికే ఈ మూడవ జాబితాలో ప్రకటించే అభ్యర్థుల విషయంలో చర్చలకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మరియు ఇతర బీజేపీ నేతలు ఢిల్లీ కి చేరి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి జెపి నడ్డా మరియు బీజేపీ చీఫ్ అమిత్ షా తో భేటీ అవ్వబోతున్నారు. ఈ మూడవ జాబితా కాకుండా తుది జాబితాను రానున్న మరికొన్ని రోజుల్లో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం తరువాత విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణాలో బీజేపీ ఎన్నికల ప్రచారం ఏమంత ఆసక్తికరంగా లేకున్నా, బీజేపీ చీఫ్ అమిత్ షా తెలంగాణ లో పర్యటించిన తరువాత కూడా పరిస్థితులు అంతగా ఏమి మారలేదని వినికిడి.

bjp