తారకరామనామ రాజకీయం… కెసిఆర్ చాణుక్యం.

kcr Political strategy for Next Elections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ఎప్పుడు నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పోడు అన్నది ఓ సినిమా డైలాగ్. త్రివిక్రమ్ రాసిన ఈ డైలాగ్ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కి అచ్చు గుద్దినట్టు సరిపోతుందని ఓ టీడీపీ నాయకుడు వ్యాఖ్యానించాడట. ఇటీవల తెలంగాణాలో తెరాస, టీడీపీ పొత్తు అన్న టాపిక్ హాట్ హాట్ గా నడుస్తున్న నేపథ్యంలో కొందరు తెలుగుదేశం నేతలు ఓ నాయకుడి ఇంటిలో పిచ్చాపాటీగా మాట్లాడుకున్నారంట. ఆ సమయంలో ఒకప్పుడు కెసిఆర్ కి దగ్గరగా మెసిలిన నాయకుడు ఈ పొత్తు కుదిరితే తెలంగాణాలో టీడీపీ కి శాశ్వతంగా సమాధి కట్టినట్టే అని అభిప్రాయపడ్డారట. పొత్తు కుదిరితే మళ్లీ అధికారం చెలాయించవచ్చని ఎదురు చూస్తున్న ఇంకో నేత అలా జరగదని వాదించారట. అప్పుడే సదరు నాయకుడు కెసిఆర్ గురించి చెబుతూ అవసరం తీరాక ఎలా విసిరిపారేస్తాడో, ఎన్టీఆర్ పేరుతో ఆయన ఎలాంటి రాజకీయం చేసాడో వివరించాడట.

ఎన్టీఆర్ పేరుని కెసిఆర్ ఎలా వాడారు అన్న దాని మీద ఒక కధ అందరికీ తెలిసిందే. ముందు అజయ్ గా వుండే కొడుకు పేరుని తారకరామారావు గా మార్చి ఆ విషయం ఎన్టీఆర్ దగ్గర చెప్పుకుని టీడీపీ టికెట్ తెచ్చుకున్నారని కెసిఆర్ మీద అందరూ చేసే ఆరోపణే. అంటే అవసరం కోసం ఎన్టీఆర్ పేరు కొడుక్కి పెట్టిన కెసిఆర్ తాజాగా ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది . నెక్లెస్ రోడ్ లో ఎన్టీఆర్ సమాధి వున్న గార్డెన్ ని ఇప్పటిదాకా ఎన్టీఆర్ గార్డెన్స్ గా పిలుస్తున్న విషయం తెలిసిందే. ఇకపై ఎన్టీఆర్ సమాధి వున్న కొద్ది ప్రాంతాన్ని ఎన్టీఆర్ ఘాట్ గా, మిగిలిన గార్డెన్ కి అంబేద్కర్ గార్డెన్ గా పేరు పెట్టడానికి కెసిఆర్ సర్కార్ పావులు కదుపుతోందట. రాబోయే ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు చెప్పిన ఆ నాయకుడు ఇప్పుడు చెప్పండి తెరాస తో పొత్తు కావాలో, వద్దో అని అడిగాడట. అదండీ తారకరామనామ రాజకీయంలో కెసిఆర్ చాణుక్యం.