బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రంగంలోకి దిగారు.. దీంతో సారొస్తారొస్తారు.. అని గులాబీ దళం మాంచి జోష్ మీద ఉంది. ఫామ్‌హౌస్ నుంచి ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారనే సంకేతాలొచ్చాయి. ఏప్రిల్ 17న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్ భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో పార్టీ నేతలతో జరిగిన భేటీలో కీలక సూచనలు చేశారు కేసీఆర్. కాగా, అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన అంశాలు.. సర్కార్‌పై సంధించాల్సిన ప్రశ్నలు..అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు కేసీఆర్.. అయితే.. డైరెక్షన్ మాత్రమే కాదు డైరెక్ట్‌గా సభకు వస్తారంటున్నారు బీఆర్‌ఎస్ నేతలు.





