ఎమ్మెల్సీ అభ్యర్ధులను ఫైనల్ చేయనున్న కేసీఆర్

Telangana Cm Kcr All Set Expand Cabinet Likely Induct 10 Ministers

కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో భక్తి పర్యటనను ముగించుకుని వచ్చిన కేసీఆర్ ఇవాళ ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు మే 6 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. స్థానిక సంస్థల కోటాలో 3 ఎమ్మెల్సీ స్థానాలైన రంగారెడ్డి, వరంగల్‌, నల్గొండ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 14న ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల దాఖలు గడువు ముగియనున్న నేపథ్యంలో ఈరోజే ఆయన అభ్యర్థులను ఖరారు చేస్తారని తెలుస్తోంది.