తెలంగాణా క్యాబినెట్ కీలక నిర్ణయాలు

kcr to take key decisions in Telangana Cabinet meeting

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నిన్న సమావేశమయిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో మంత్రివర్గం కీలకాంశాలపై చర్చించింది. ఈ సమయంలో క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలివే:
హైదరాబాద్‌లో 71 ఎకరాల్లో చేపట్టే బీసీల ఆత్మగౌరవ భవన నిర్మాణాలకు రూ.71కోట్లు కేటాయింపు.
గోపాలమిత్రల గౌరవ వేతనాన్ని రూ.3,500 – రూ.8,500లకు పెంపు.
అర్చకుల పదవీ విరమణ వయస్సు 58 ఏళ్ల నుంచి 65 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం. అర్చకుల జీతాలను ప్రభుత్వమే చెల్లించేలా ఆమోదం.ఎన్‌యూహెచ్‌ఎంలో పనిచేస్తున్న 9వేల మందికి కనీస వేతనాలు పెంపుకు నిర్ణయం.
హైదరాబాద్‌లో రెడ్డి హాస్టల్ కోసం మరో 5 ఎకరాలు కేటాయింపు.
ఆశా కార్యకర్తల గౌరవ వేతనం రూ. 6 వేల నుంచి 7500లకు పెంచుతూ నిర్ణయం.
వైద్యారోగ్య శాఖలో శాఖలో పని చేస్తున్న సెకండ్ ఏఎన్‌ఎంలకు రూ.11 వేల నుంచి రూ. 21 వేలకు పెంపు,
కాంట్రాక్ట్ డాక్టర్ల వేతనం రూ. 40 వేలకు పెంపు.
సిద్దిపేట జిల్లాలో తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీస్ 9వ బెటాలియన్ ఏర్పాటుకు నిర్ణయం.