నివేదన మాత్రమే…అవి అప్పుడే కాదు !

KCR not responding on early elections at Pragati Nivedana Sabha

గత కొద్ది రోజులుగా తెలంగాణా మొత్తం ఒకటే చర్చ అదే ముందస్తు ఎన్నికలు. ముందస్తు ఎన్నికలు ఖాయమని ప్రగతి నివేదన సభలో సీఎం కేసీఆర్ స్వయంగా అసెంబ్లీ రద్దుపై ప్రకటన చేయబోతున్నారని కొద్దిరోజులుగా విస్తృతంగా ప్రచారం జరిగింది. ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయంటూ కేసీఆర్ ఇచ్చిన కొన్ని సంకీతలు దానిని బలపరుస్తూ వచ్చాయి. అయితే నిన్న జరిగిన సభ మాత్రం అదంతా ఒట్టిదే అని తేల్చేసింది. నిన్న సభలో ప్రసంగించిన కేసీఆర్ ముందస్తు ఎన్నికలపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండానే సభను ముగించేశారు. కేవలం ఈ నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వం చేపట్టిన పథకాలను మాత్రమే ప్రజలకు వివరించారు. అలాగే కొత్త పథకాల ప్రకటన సంగతి అసలు ఎత్తకపోగా ఎన్నికల మేనిఫెస్టో కమిటీని త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పుకొచ్చారు.

kcr

చివర్లో ముందస్తు ఎన్నికలపై మీడియాలో వస్తున్న వార్తల పై స్పందించిన ఆయన మీడియాలో ఇలాంటి వార్తలు వస్తున్నయని కేబినెట్ సహచరులతో కూడా తనతో ప్రస్తావించారని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజలకు ఏది మంచిదైతే ఆ నిర్ణయం తీసుకోమని మంత్రవర్గ సభ్యులు తనతో చెప్పారన్నారు. దాదాపు గంటసేపు సాగిన ప్రసంగంలో ముందస్తుపై కేసీఆర్ ఓ నిమిషం పాటు మాట్లాడడంతో ప్రతిపక్షాలకి ఉపశమనమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

kcr