పసిపిల్లల్ని విషమిచ్చి చంపి ప్రియుడితో పరారైన తల్లి

mother kills kids and elopes lover

 

మానవ సంబంధాలు మంట గలిసిపోతున్నాయి. శారీరిక సుఖాలకు మరుగుతున్న కొందరు ఆడవాళ్ళు ఆ సుఖాల కోసం తమ కడుపునా పుట్టినవారిని చంపుకోడానికి కూడా వెనుకాడడంలేదు. ఇటీవల తన వివాహేతర బంధానికి అడ్డు వస్తున్నాడని పదిహేడేళ్ళ ఇంటర్ చదివే కొడుకుని కన్నా తల్లి పొట్టన పెట్టుకున్న ఘటన మరవక ముందే మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రియుడి మోజులో పడి కడుపున పుట్టిన కొడుకు, కుమార్తెను అంతమొందించిందో కసాయి తల్లి. చెన్నైకి చెందిన ఒక మహిళ ఈ దారుణానికి పాల్పడింది. అందుతున్న సమాచారం మేరకు చెన్నై పల్లవరం తాలూకా కుండ్రత్తూర్‌కి చెందిన విజయ్‌(34) బ్యాంక్‌ ఉద్యోగి అతనికి అభిరామి (28) అనే భార్య ఉంది. ఈ దంపతులకి అజయ్‌(5) అనే కుమారుడు, కారుణ్య(4) అనే కుమార్తె ఉన్నారు.

mother kills kids

సాఫీగా సాగుతున్న్ వీరి సంసారంలోకి మూడు నెలల కిందట వారి ఫ్యామిలీ ఉండే చోటుకి దగ్గరలో ఉన్న బిర్యానీ హోటల్ లో పనిచేసే సుందరం అనే యువకుడు ఎంటర్ అయ్యాడు. అతనితో అభిరామికి పరిచయం ఏర్పడింది. మొదట పరిచయం ప్రేమగా మారి అది వివాహేతరసంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో భర్తకు తెలియకుండా సుందరంను కలుస్తూ ఉండేది అభిరామి. అయితే వీరి వ్యవహారం ఇరుగుపొరుగు వారికీ తెలిసి భర్తకు చెప్పారు. అతను ఆమెను మందలించాడు. ఇదే విషయమై భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో భర్త, పిల్లలను అడ్డుతోలగించుకుంటే తనకు, తన సుఖానికి అడ్డు ఉండదని భావించింది ఆమె.

kids

ఈ క్రమంలో నెల చివరి రోజు కావడంతో శుక్రవారం బ్యాంక్‌లో పని అధికంగా ఉంటుందని, ఆలస్యంగా వస్తానని భార్యతో చెప్పి విజయ్‌ బ్యాంకుకు వెళ్ళాడు. రాత్రి ఇంటికి వచ్చిన అతడు ఇంటి తలుపులు మూసివుండడం, ఇంట్లో లైట్లు వెలుగుతుండడంతో తన వద్ద ఉన్న మరో తాళంతో తలుపులు తెరిచి లోపలికి వెళ్ళాడు. ఇంట్లో ఇద్దరుపిల్లలు నోట్లోనుంచి నురగలు కక్కుకుని విగతజీవులుగా పడి ఉన్నారు. పిల్లల్ని అలా చూసి హతాశుడైన విజయ్ వెంటనే భార్యకోసం చూశాడు. ఆమె ఇంట్లో లేకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కాగా పోలీసు దర్యాప్తులో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారన్నకారణంగా తల్లే ప్రియుడితో కలిసి పిల్లలకు పాలల్లో విషం కలిపి అంతమొందించినట్టు తేలింది. అంతేకాక బ్యాంకులో పని ఒత్తిడి విజయ్ ను బతికించింది ఎందుకంటే అతను వస్తే అతనికి కూడా విషం కలిపిన పాలు ఇచ్చి చంపేందుకు ఆమె రంగం సిద్దం చేసుకున్నట్టు తేలింది.

mother-kills-kids