కరోనా విషయంలో జనాల్ని జాగృత పరుస్తూ వస్తున్న సీఎం.. తాను మాత్రం మాస్కుతో కనిపించిన సందర్భాలు అరుదు. మీడియాలో కనిపించే ఫొటోల్లో కేసీఆర్ చాలా వరకు మాస్కు లేకుండానే కనిపిస్తున్నారు. ఐతే ఇప్పటిదాకా కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్లు, కలిసిన వాళ్లలో ఎవరూ కరోనా బారిన పడ్డట్లు పెద్దగా వార్తలు రాలేదు. ఆయన కూడా తనను కలిసే వారితో దూరంగానే ఉంటూ వచ్చారు.
కానీ చిరు ఆయనతో సన్నిహితంగానే మెలిగారు. చాలా సమీపంలోకి వచ్చి వరద సాయం చెక్కును అందజేశారు. దీంతో కేసీఆర్ భయపడుతున్నట్లు తెలిసింది. కేసీఆర్‌తో పాటు చిరును కలిసిన సంతోష్‌లకు కరోనా పరీక్ష చేయిస్తే ప్రస్తుతానికి నెగెటివ్‌యే వచ్చింది. ఐతే ఇద్దరూ క్వారంటైన్ అయ్యారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ పరీక్షలు చేయించుకోనున్నారు.
చిరుతో కలిసి నాగ్ కూడా కేసీఆర్‌ను కలిసిన నేపథ్యంలో ఆయన కూడా అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఆయన హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్’ టీం కూడా జాగ్రత్త పడాల్సిందే. చిరును చరణ్ కూడా కలిసి ఉంటాడు కాబట్టి అతను నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ టీంపైనా ప్రభావం ఉండకపోదు. మొత్తానికి చిరు ఒక్కడికి కరోనా అనగానే అటు రాజకీయ, ఇటు సినీ వర్గాల్లో కలకలమే రేగింది.