అధికారికంగా మారథాన్ అనేది 42.195కిలోమీటర్ల పరుగు పందెం. ఒక రహదారి రేసు లాగే మారథాన్ అమలు చేయబడుతుంది. మొదట్లో మారథాన్ అనేది ఆధునిక ఒలింపిక్ ఈవెంట్ల్లో ఒకటిగా ఉన్నది. స్వచ్ఛంద అథ్లెటిక్‌గా పాల్గొనే అవకాశంఉన్న మారథాన్లు ప్రపంచ వ్యాప్తంగా 500కంటే ఎక్కువే ప్రతి సంవత్సరం నిర్వహించబడుతున్నాయి. వేలకొలది వ్యక్తులు మారథాన్‌ల్లో పాల్గొనవచ్చు.
షికాగో, అమెరికాలో నిర్వహించిన మహిళల మారథాన్‌లో కెన్యా అథ్లెట్ బ్రిగిడ్ కోస్గె అరుదైన ఘనత సాదించింది. కొత్త ప్రపంచరికార్డు సృష్టించిన 25 ఏళ్ల ఈ కెన్యాఅథ్లెట్ 42.195కిలోమీటర్ల పరుగు పందెంలో ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించింది.42.195 కిలోమీటర్ల దూరాన్ని 2గంటల 14నిమిషాల 4సెకన్లలో పూర్తిచేసి విజయం పొందింది.ఇంతకుముందు ఉన్నబ్రిటన్ కి చెందిన అథ్లెట్ పౌలా రాడ్‌క్లిఫ్ సాదించిన ప్రపంచ రికార్డును కొల్లగొట్టింది.పదహారేళ్ల కింద పౌలా రాడ్‌క్లిఫ్ 2గంటల 15నిమిషాల 25 సెకన్లలో 42.195 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేసింది.పౌలారాడ్క్లిఫ్ కన్నా తక్కువసమయంలో 1నిమిషం 21సెకన్ల తక్కువ సమయంలోనే కెన్యా అథ్లెట్ బ్రిగిడ్ కోస్గె పూర్తి చేసి ప్రపంచ రికార్డును పొందింది.