మనం చేసే మంచి పని ఏదో ఓ రూపంలో మనకి సహాయపడుతుందంటారు. సరిగ్గా అలానే ఆపదలో ఉన్న ఓ పిల్లిని కొందరు మానవత్వం కాపాడారు. అదే వాళ్లకు అదృష్ట దేవతలా మారి 10 లక్షల రివార్డు వచ్చేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన ఇద్దరు వ్యక్తులు నసిర్ షిహాబ్, మహమ్మద్ రషిద్ దుబాయ్‌లో పని చేస్తున్నారు. నసిర్ బస్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా.. రషిద్ కిరాణ కొట్టుతో జీవనం సాగిస్తున్నారు.ఇటీవల ఓ భవనం రెండో అంతస్తు నుంచి పిల్లి కింద పడిపోయే ప్రమాదం ఉన్నట్లు రషిద్ గమనించాడు.
నసిర్ కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నాడు. ఇక వెంటనే ఆ ఇద్దరూ పిల్లిని ఎలాగైనా కాపాడాలని నిర్ణయించుకున్నారు. దీంతో వారు పిల్లి సరిగ్గా కింద పడే ప్రాంతంలో బెడ్ షీట్‌ని పట్టుకుని నిలబడ్డారు. ఆ పిల్లికి పట్టు దొరకక.. రెండో అంతస్తు బాల్కనీ నుంచి నేరుగా వారి ఉంచిన ఆ బెడ్ షీట్‌లో పడి ప్రాణాలు దక్కించుకుంది. అయితే.. ఆ పిల్లి ప్రెగ్నెంట్‌గా ఉండటంతో.. దాన్ని కాపాడిన ఆ ఇద్దరు భారతీయులను, వారికి సహాయం చేసిన మరో ఇద్దరిని అక్కడి స్థానికులు మెచ్చుకున్నారు.
దీనికి సంబంధించిన వీడియోను రషిద్.. తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేశాడు. దీంతో ఆ వీడియో దుబాయ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి చివరికి ఆ దేశ రూలర్‌షేక్ మహమ్మద్ బిన్ రషిద్ కంట పడింది. దీంతో షేక్ మహమ్మద్.. పిల్లిని కాపాడినందుకుగాను 10 లక్షల రివార్డును ప్రకటించాడు. ఆ ఇద్దరి భారతీయులతో పాటు ఈ రెస్క్యూ ప్లాన్‌లో సహకరించిన పాక్ దేశస్తుడైన అతీఫ్ మెహమూద్, మొరాకో సెక్యూరిటీ గార్డు అష్రఫ్ కూడా బహుమతులు అందించాడు.