రేషన్ కార్డులలో కీలక మార్పులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. BPL వర్గాలకు మూడు రంగుల కార్డులు, APL వర్గాలకు ఆకుపచ్చ రంగు రేషన్ కార్డులు జారీ చేయనున్నట్టు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కొత్త కార్డుల ముద్రణ కోసం ఇప్పటికే టెండర్లు పిలిచామని, త్వరలో వాటిని అందజేస్తామని తెలిపారు ఉత్తమ్.