
ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ నూతన రథసారథి ఎవరన్న దానిపై త్వరలో స్పష్టత రానుంది. బీజేపీ సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్ 16న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో కీలక సమావేశం జరిగింది. ప్రధానమంత్రి నాయకత్వంలో జరిగిన ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక గురించి కూడా చర్చ జరిగినట్లు సమాచారం. ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ సంస్థాగత కార్యదర్శి బీఎల్ సంతోష్ పాల్గొన్నారు




