కొణిదెల కుటుంబానికి నాదెండ్ల భాస్కర రావు అలా ఉపయోగపడ్డాడా…?

Key-Role-To-Pawan-Friend-In

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడిప్పుడే తన రాజకీయ కార్యకలాపాల వేగాన్ని పెంచాడు పవన్ పార్టీ పెట్టి ఐదేళ్లయినా ఎప్పటి వరకు పెద్దగా చేసిందేమీ లేదు. తాజాగా రాజమహేంద్రవరం బ్రిడ్జి మీద జనసేన కవాతుతోవచ్చే ఎన్నికల వేళ జనసేన కార్యకలాపాలను కాస్త ముమ్మరం చేసినట్లు అయింది. ఇక ఇప్పుడు తుని సభకు రైలలో వెళ్ళడం లాంటిది ఏదో ప్లాన్ చేశారు ప్రస్తుతం ఆ విషయాలు పక్కన పెడ్తే పవన్ పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ వెనకాల వేదికల మీద పేరున్న నాయకులు ఎవరూ ఉండేవారు కాదు మీడియాలో చేసిన కొంతమంది ప్రముఖులు రాజకీయ అనుభవం ఉన్నవాళ్లు ఉన్న వారందరూ తెర వెనకే పరిమితమయ్యారు.

manohar

ఇతర పార్టీలకు చెందిన కొందరు ప్రముఖులను పవన్ జనసేన నేర్చుకున్న వారికి సైతం పవన్ తన వేదికల మీద తన పక్కన చోటు కల్పించిన దాఖలాలు లేవు. కానీ తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు తనయుడు మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. నాదెండ్ల మనోహర్ ఎలాంటి అంచనాలు లేకుండా పార్టీలో చేరిన ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన జనసేన లో చేరి చాలా మందిని ఆశ్చర్యపరిచారు. అయితే పార్టీలో చేరినప్పటి నుంచి పవన్ పక్కన ఎక్కడ చూసినా నాదెండ్ల మనోహర్ ఏ కనిపిస్తున్నారు. ఆయన తిరుపతి వెళ్ళినా ఎకడికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్లినా తాజాగా జరిగిన పవన్ పక్కనే మనోహర్ ఉంటున్నారు. దీనిని బట్టి నాదెండ్ల మనోహర్ కు పవన్ ఎంత ప్రాదాన్యత ఇస్తున్నారో ? ఎంత ఉందో స్పష్టంగా తెలుస్తోంది.

pawan-kalyan-tour

ఇప్పటికే చాలామంది జనసేనలో నెంబర్ టు పొజిషన్ అని చర్చించుకుంటున్నారు. మనోహర్ కు పవన్ ఇచ్చే ప్రయారిటీ ఎలా ఉన్నా ఆది నుంచి పవన్ ని నమ్ముకుని జనసేన ఏర్పాటుకు ముందు నుంచే ఆయనకు వేరు అభిమానులుగా ఉన్న వారికి మాత్రం లేదని తెలుస్తోంది. ఇక రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ స్పీకర్ స్పీకర్ గా ఉన్న మనోహర్ కు రాజకీయాలపై కన్నా రాజ్యాంగబద్ధ పదవులపై మంచి గ్రిప్ ఉంది. ఈ క్రమంలోనే మనోహర్ తో పవన్ రాజకీయ పాఠాలు చెప్పించు కుంటున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే వీటన్నిటి కంటే మరో బంధం వీరి మధ్య ఉందని పవనే ఈ మధ్య ప్రకటించాడు అదేమిటంటే స్కూల్లో వారు ఇద్దరూ కలిసి చదువుకున్నారు అట. ఎక్కడ ఏ స్కూల్ అనే విషయాన్నీ పక్కన పెడితే తాజాగా పవన్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ తాలూకా వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది అదేంటంటే అసలు చదువు ఇంట్రెస్ట్ లేని పవన్ కు తన జీవితంలో ఎక్కడా మంచి గణితం టీచరు తారసపడలేదట అందుకే లెక్కలంటే భయం పోలేదని ప్రతి పరీక్షలోనూ అత్తెసరు మార్కులే వచ్చేయని చెప్పుకొచ్చాడు.

Nadendla-Manohar

దీంతో పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల్లోనూ లెక్కలే దెబ్బకొట్టాయి. మూడు మార్కుల తేడాతో ఫెయిల్‌ అయిపోయాను. సరిగ్గా ఆ సమయంలోనే, రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులొచ్చి ఎన్టీఆర్‌ను పదవిలోంచి దించేసి, నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రి అయ్యారని ఆయనిచ్చిన ఐదు గ్రేస్‌మార్కులతో ఒడ్డునపడిపోయాను. అంతా బాధపడుతున్న సమయంలో ఆ మార్కులు తీసుకున్నందుకు ఇబ్బందిగానే అనిపించిందని కాస్త బాద పడుతూనే చెప్పుకొచ్చారు. అయితే అలా ఒకసారి కొణిదెల ఫ్యామిలీకి నాదెండ్ల సహాయం చేశారు అనుకుంటే నిన్న హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో కుమారుడు పవన్ కళ్యాణ్‌ ను కలిసేందుకు వచ్చిన అంజనా దేవికి పార్టీ నేత శ్రీ నాదెండ్ల మనోహర్ శ్రీమతి అంజనాదేవికి నమస్కరించగా వారి తండ్రి శ్రీ నాదెండ్ల భాస్కర రావు ఉత్తర్వు కారణంగా తన కుటుంబానికి కలిగిన మేలును గుర్తుచేసుకున్నారు.

pawan-kalyan

శ్రీ ఎన్.టి. రామారావు ప్రభుత్వం ఉద్యోగుల వయోపరిమితిని 55 సంవత్సరాలకు తగ్గించగా, శ్రీ నాదెండ్ల భాస్కర రావు ముఖ్యమంత్రి కాగానే వయోపరిమితిని 58 ఏళ్లకు పెంచారని, దీని కారణంగా తన భర్తకు మరో మూడేళ్ళ పాటు ప్రభుత్వానికి సేవలందించే అవకాశం కలిగిందని, ఇది తమ కుటుంబానికి ఎంతో ఆనందం కలిగించిందని శ్రీమతి అంజనాదేవి చెప్పుకొచ్చారు. ఆ విధంగా ఆ కుటుంబానికి రెండో సారి సహాయం చేసినట్టయ్యింది. దీంతో పవన్ మనోహర్ ల బంధం ప్రస్తుతానికి అయితే గట్టిగానే ఉంది మరి ముందు ముందు ఏమి జరగనుందో ?