కెరీర్ మొదటిలో ఇబ్బందులు

కెరీర్ మొదటిలో ఇబ్బందులు

కన్నడ స్టార్ హీరో యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన ‘కేజీఎఫ్ 2’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ టాక్ సొంతం చేసుకుని రికార్డు కలెక్షన్స్‌తో దూసుకెళుతోంది. యష్‌ ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా కన్నడ ఇండస్ట్రీలో ఈ స్థాయికి ఎదగడం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అని చెప్పొచ్చు. ప్రస్తుతం తాను ఇంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ, ఒకప్పుడు సాధారణ జీవితం గడిపాడు. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు. తన కెరీర్ మొదటిలో పడ్డ ఇబ్బందుల గురించి యశ్ ఇటీవల పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు.

సినీ అవకాశాల కోసం తాను కేవలం మూడు వందల రూపాయలతో బెంగళూరులో అడుగుపెట్టాననే విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. కర్ణాటకలోని హసన్ జిల్లాలో పుట్టిన యశ్ ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబానికి చెందినవాడు. తండ్రి బస్‌ డ్రైవర్, తల్లి గృహిణి. కాగా యశ్‌ సినిమాల్లోకి వెల్లేందుకు వారి కుటుంబం అంగీకరించలేదు. కానీ వారు యష్‌ కోసం సినిమాల్లో ప్రయత్నించేందుకు తనకు కొంత సమయం మాత్రం ఇచ్చారు. ఆ సమయంలోపు అవకాశాలు దక్కించుకుంటే సరి. లేదంటే తాము చెప్పిన పనిలో చేరాలని సూచించారు. దీనికి అంగీకరించిన యశ్ తన తండ్రి నుంచి తీసుకున్న మూడు వందల రూపాయలతో బెంగళూరు చేరుకున్నాడు.

ఈ విషయం గురించి యశ్ మాట్లాడుతూ.. మూడు వందల రూపాయలతో బెంగళూరు చేరుకున్న నేను మొదట సీరియల్స్‌లో అవకాశం దక్కించుకున్నాను. తర్వాత మెల్లిగా సినిమాల్లోకి అడుగుపెట్టా అని చెప్పుకొచ్చాడు. అలా యశ్ సీరియల్స్‌లో నటిస్తున్నప్పుడే తనకంటూ మంచి పేరు తెచ్చుకున్నాడు. తర్వాత కన్నడ చిత్రాలలో చిన్న చిన్న సపోర్టింగ్ క్యారెక్టర్స్‌ కూడా చేశాడు. చివరకు 2008లో ‘రాకీ’ చిత్రంతో హీరోగా మారాడు. ఆ తర్వాత వచ్చిన వరుస హిట్‌లతో యశ్ కన్నడనాట స్టార్‌ హీరోగా ఎదిగాడు. ‘కేజీఎఫ్’తో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. ఇక ఇటీవలే విడుదలైన ‘కేజీఎఫ్-2’తో బాలీవుడ్‌, టాలీవుడ్‌ అని తేడా లేకుండా పాన్‌ ఇండియా స్టార్‌గా యష్‌ అవతరించాడు.