టేకులపల్లి పరిధి డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రాంగణం సమీపంలో ఓ వృద్ధుడు ఐదో తరగతి చదువుతున్న బాలికతో అసభ్యంగా ప్రవర్తించడంతో స్థానికులు దేహశుద్ధి చేశారు. బాధిత బాలిక తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. పదేళ్ల బాలిక తన తమ్ముడితో కలిసి గురువారం ఇళ్ల సమీపంలో రేగిపండ్ల కోసం వెళ్లగా అరటిపండ్లు విక్రయించే 53ఏళ్ల వీరమల్ల వెంకన్న ఆమెను దగ్గరకు తీసుకున్నాడు.
కౌగిలించుకుని అసభ్యంగా ప్రవర్తిస్తుండడంతో చిన్నారి గట్టిగా కేకలు వేయగా వదిలేయడంతో పరుగున ఇంటికి చేరుకుని విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. కోపోద్రిక్తుడైన తండ్రి స్థానికులతో కలిసి డబుల్ బెడ్రూం బ్లాక్లో ఉన్న అతడి ఇంటికి వెళ్లి కొట్టి పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ట్లు ఖానాపురం హవేలీ ఠాణా సీఐ జే.రామకృష్ణ తెలిపారు.