ఉత్తరప్రదేశ్ లో ఘోరం చోటు చేసుకుంది. ప్రేమించిన పాపానికి ఓ యువకుడిని సజీవ దహనం చేశారు. ఏకంగా చెట్టుకు కట్టేసి నిప్పంటించారు. ఈ ఘటనలో బాధిత యువకుడు కాలి బూడిదై పోయాడు. నిస్సహాయస్థితిలో ప్రాణాలు విడిచాడు. ఉత్తర ప్రదేశ్ లోని ప్రతాప్ గఢ్ జిల్లాలో ఈఘటన చోటుచేసుకుంది. ముఖ్యంగా ఇరవై ఐదేళ్ళ అంబికా పటేల్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఆ యువతి కూడా అంబికా పటేల్ ను ప్రేమించింది. వీరిద్దరి ప్రేమ విషయం తెలుసుకున్న యువతి తరపు బంధువులు అంబికా పటేల్ ను బెదిరించ సాగారు. ఆ యువతి తో సాగిస్తున్న ప్రేమాయణానికి అడ్డు చెప్పారు. దీంతో తాను ఏమాత్రం వారి మాట వినక పోవడంతో పఠాన్ పూర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు యువతి తరపు బంధువులు. దీంతో అంబికా పటేల్ పై కేసు కూడా నమోదైంది. అయినా కానీ అంబికా ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు. కాగా యువతి తరపు కుటుంబ సభ్యులు కోపంతో ఊగిపోయారు. అంబికా పటేల్ ను చెట్టుకు కట్టేసి నిప్పంటించేశారు. ఈ ఘటనలో అంబికాపతి సజీవ దహనం అయ్యాడు.