ప్రేమ వివాహం.. ఆపై మూడు నెలలోనే చంపేసిన భర్త

కొత్తగా పెళ్లైంది. అప్పుడే ఆమెకి నూరేళ్లు నిండాయి. నమ్మి వచ్చిన ప్రియుడే ఆమెను చంపేశాడు. ఎంతగానో ప్రేమిస్తున్నానని చెప్పి తీరా పెళ్లి చేసుకొని చివరకి అతి దారుణంగా చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలని ప్లాన్ చేశాడు దుర్మార్గపు భర్త. గొంతు నులిమేసి చంపేసి ఆ తర్వాత సీలింగ్ ఫ్యాన్‌కి వేలాడదీసి సూసైడ్ చేసుకుందని నమ్మించాడు. అది నమ్మేసిన వైద్యులు, పోలీసులు ఆమె ఆత్మహత్యకు పాల్పడిందనే భావించారు. అయితే అది కాసేపే. పోస్టుమార్టం రిపోర్ట్‌ చూసిన పోలీసులు షాక్‌కు గురయ్యారు. అది ఆత్మహత్య కాదు.. కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని తెలిసిపోయింది.

భర్తపై అనుమానంతో అదుపులోకి తీసుకుని తమ స్టైల్లో విచారించడంతో అసలు నిజాలు కక్కేశాడు. ఆమెను టార్చర్ చేసి దారుణంగా చంపేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు తెల్పాడు. కోల్డ్ బ్లడెడ్ మర్డర్ స్టోరీని చాకచక్యంగా ఛేదించారు.అయితే ఈ హత్య ఎక్కడ జరిగింది అంటే కేరళలో చోటుచేసుకుంది. కేరళలో వామనపురానికి చెందిన ఆదర్శ్(26), వెంబయం ప్రాంతంలోని వెట్టినాడ్ గ్రామానికి చెందిన రాజెందు(19) యువతి ఇద్దరూ ప్రేమంచుకున్నారు.

ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని భావించి ఇంటి నుంచి పారిపోయారు. గత జనవరిలో పెళ్లి చేసుకొని ఆ తర్వాత నేదుమనగడ్ పరిధిలోని నన్నట్టుకావు గ్రామంలో అద్దెకు ఇల్లు తీసుకుని నివాసముంటున్నారు. కొంతకాలం సాఫీగా సాగింది. అయితే అప్పుడప్పుడు రాజెందు తన తల్లిదండ్రులను చూడాలనిపిస్తుందని.. వెళ్లొస్తానని అడుగుతుండేది. అది నచ్చని ఆదర్శ్ ఆమెతో గొడవ పడుతుండేవాడు. దాంతో ఇద్దరి మధ్య వివాదాలు చెలరేగాయి.ఇదే గొడవగా మారింది. ఓ సారి పెద్దగొడవ జరగడంతో ఆదర్శ్ తన భార్యను చంపేయాలని డిసైడయ్యాడు. దాంతో భార్యకు బలవంతంగా..

మద్యం తాగించి గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత సీలింగ్ ఫ్యాన్ కు ఆమెను వేలాడదీసి ఆత్మహత్య చేసుకుందని నమ్మించే ప్రయత్నం చేశాడు. తన భార్య ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యా యత్నం చేసిందని.. వెంటనే ఆమెను కిందకు దించి తీసుకొచ్చానని.. ఎలాగైనా రక్షించాలంటూ డాక్టర్ల వదద ప్రాదేయ పడ్డాడు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. తర్వాత పోస్ట్‌మార్టం రిపోర్ట్‌తో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. పోలీసులు వచ్చి ఆ ఘటన పట్ల ఆరా తీశారు.

విషయం తెలుసుకొన్న పోలీసులకు పోస్టుమార్టం రిపోర్ట్‌లో దిమ్మతిరిగి పోయే నిజాలు వెలుగు చూశాయి. ఆమె గొంతుపై గాయాలున్నాయని.. ఆమెను ఊపిరాడకుండా చేసి చంపేశారని తెలియడంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. ఆదర్శ్‌ని అదుపలోకి తీసుకున్న పోలీసులు అతడిని విచారించగా షాక్ తినే నిజాలు బయటపడ్డాయి. దీంతో అతడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.