పుతిన్ ను రష్యాకు ఆహ్వానించిన కిమ్…

Kim invited Putin to Russia...
Kim invited Putin to Russia...

గత రెండ్రోజులుగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ రష్యాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్​తో కిమ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో ఉక్రెయిన్​తో యుద్ధంలో రష్యాకు మద్దతిస్తామని కిమ్ ప్రకటించారు.ప్రధానంగా సైనిక అంశాలే ఈ ఇద్దరు నేతల చర్చల్లో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ఇటీవల ఉత్తరకొరియా చేసిన క్షిపణి ప్రయోగాలు చాలా సందర్భాల్లో విఫలమైన విషయం తెలిసిందే. రష్యా ఈ నేపథ్యంలో అందించే టెక్నాలజీ కీలకమని కిమ్‌ భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఉత్తరకొరియా ఉపగ్రహ, అంతరిక్ష కార్యక్రమాలను అభివృద్ధి చేసేందుకు పుతిన్‌ సానుకూలత కూడా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

రష్యా అయితే రెండు దేశాల మధ్య ఎలాంటి ఒప్పందాలు జరగలేదని చెబుతోంది. ప్రస్తుతం రష్యా పర్యటనలోనే ఉన్న కిమ్.. శుక్రవారం రోజున కమ్స్‌మలస్కాన్‌ అముర్‌లో యుద్ధ విమానాలు తయారు చేసే ప్లాంట్‌ను సందర్శించారు. పుతిన్‌ను ఈ సందర్భంగా ఉత్తర కొరియాలో పర్యటించాల్సిందిగా కిమ్ జోంగ్ ఉన్ ఆహ్వానించారు. దీనికి రష్యా అధ్యక్షుడు కూడా అంగీకారం తెలిపారు. ఈ విషయాన్ని మాస్కో ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ తెలిపారు.