తెలుగు బిగ్‌బాస్ సీజన్ 2 నుండి మూడవ ఎలిమినేషన్ జరిగి పోయింది. వారం ఆరంభంలో అంతా కూడా సామాన్యుడు గణేష్ ఈసారి ఇంటికి చెక్కేయడం ఖాయం అని అంతా భావించారు. ఇప్పటికే ఇంటి నుండి ఇద్దరు సామాన్యులు బయటకు వెళ్లి పోవడం, వారి దారిలోనే గణేష్ వెళ్లి పోవడం అనుకుంటున్న సమయంలో నటుడు కిరీటి ఇంటి నుండి వెళ్లి పోయాడు. కిరిటీ చేసిన చిన్న తప్పు కారణంగా ఆయన్ను ప్రేక్షకులు ఇంటి నుండి వెళ్ల గొట్టేశారు. కెప్టెన్సీ టాస్క్‌లో కౌశల్ కంట్లో నిమ్మరసం పిండటంతో మొదలైన కిరీటి పతనం చివరకు ఇంటి నుండి బయటకు వెళ్లి పోయే వరకు వచ్చింది. అత్యుత్సాహంతో, ఇంట్లో అతిగా ప్రవర్తిస్తున్నాడు అంటూ అందరితో విమర్శలు ఎదుర్కొన్న కిరిటీ చివరకు ఇంట్లోంచి వెళ్లి పోయాడు.
మూడవ వారం ఎలిమినేట్ అయిన కిరీటికి, సామాన్యుడు గణేష్‌కు మద్య కొన్ని ఓట్ల తేడా మాత్రమే ఉంది. ఆ కొన్ని ఓట్లు కిరీటిని ఇంటి నుండి బయటకు వెళ్లి పోయేలా చేసింది. గీతామాధురి, భావన మరియు దీప్తి సునైనాలు సునాయాసంగా సేప్ అయ్యారు. ఇక సామాన్యుడు గణేష్‌కు కూడా మంచి ఓట్లు వచ్చాయి అంటూ స్టార్ మా వారు చెబుతున్నారు. గణేష్‌లో వస్తున్న మార్పును చూసి అంతా షాక్ అవుతున్నారు. ప్రేక్షకులు కూడా గణేష్ వంటి వ్యక్తి ఇంట్లో ఉండాలని భావిస్తున్నట్లుగా ఓట్లు వేశారు. మొత్తానికి బిగ్‌బాస్ సీజన్ 2 నుండి మూడవ ఎలిమినేషన్ కిరీటి అవ్వడం జరిగింది. ఇంటి నుండి బయటకు వచ్చి, నానితో స్టేజ్‌పై నుండి ఇంటి సభ్యులతో కిరీటి మాట్లాడటం జరిగింది. ఆ సమయంలో కిరీటి గురించి అంతా కూడా పాజిటివ్‌గా మాట్లాడారు. ఇంట్లోంచి కిరీటి కన్నీరు పెట్టుకుంటూ వెళ్లి పోయాడు. మరి ఈ వారం ఎలిమినేషన్లో ఎవరు ఉంటారో చూడాలి.