కేఎల్‌ రాహుల్‌ చెత్త రికార్డు

కేఎల్‌ రాహుల్‌ చెత్త రికార్డు

ఐపీఎల్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఓ చెత్త రికార్డును నమోదు చేశాడు. ఒకే ఐపీఎల్‌ సీజన్‌లో తొలి బంతికి రెండు సార్లు ఔటైన మూడో ఆటగాడిగా రాహుల్‌ నిలిచాడు. ఐపీఎల్‌-2022లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ట్రెంట్‌ బౌల్ట్‌ వేసిన తొలి బంతికే రాహుల్‌ క్లీన్‌ బౌలడ్డయ్యాడు. అంతకుముందు టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మహ్మద్‌ షమీ బౌలింగ్‌లో తొలి బంతికే రాహుల్‌ ఔటయ్యాడు.

ఈ క్రమంలో ఈ చెత్త రికార్డును మూటకట్టుకున్నాడు. కాగా చెత్త రికార్డు సాధించిన జాబితాలో రాహుల్‌ కంటే ముందు సనత్‌ జయసూర్య, ఉన్మక్త్‌ చంద్‌ ఉన్నారు. 2009 సీ.జన్‌లలో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సనత్‌ జయసూర్య తొలి బంతికే ఒకే సీజన్‌లో రెండు సార్లు ఔట్‌ కాగా.. 2013 సీజన్‌లో ఉన్మక్త్‌ చంద్‌ కూడా ఈదే విధంగా ఔటయ్యాడు.