బన్నీ గత జన్మలో ఏంటో తెలుసా?

Know-what-the-bunny-was-las

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మనిషి చేసే పాప పుణ్యాలను బట్టి పునర్జన్మ ఉంటుందని హిందు ధర్మ చెబుతుంది. పూర్వ జన్మ ఉందో లేదో తెలియదు కాని, కొందరు పండితులు మరియు జ్యోతిష్యులు మాత్రం పూర్వ జన్మల గురించి అనర్ఘలంగా మాట్లాడేస్తూ ఉంటారు. ఇటీవల సినీ వర్గాల వారిలో పూర్వ జన్మల గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది. ఆ మద్య రాజమౌళి గత జన్మలో ఏంటి అనే విషయమై పెద్ద చర్చ జరిగింది. తాజాగా అల్లు అర్జున్‌ గత జన్మలో ఏంటి అనే విషయాన్ని ప్రముఖ ఆస్ట్రాలజర్‌ ఎస్వీ నాగనాథ్‌ చెబుతున్నారు.

గత జన్మలో అల్లు అర్జున్‌ రైతు అని, ఉత్తరభారతదేశంలో ఒక సాదారణ రైతు కుటుంబంలో పుట్టి, సాదారణ రైతుగానే జీవితం సాగించాడని, అయితే పొలం దున్నుతున్న సమయంలో తనకు బంగారు నాణెలు భిస్తే వాటిని పేదలకు పంచడం వల్ల పుణ్యంను దక్కించుకున్నాడని, ఆ పుణ్యం కారణంగానే అల్లు అర్జున్‌కు ఈ జన్మలో ఈ స్థాయి దక్కిందని ఆయన అంటున్నారు. ఇందులో నిజం ఎంత ఉంది అనే విషయం పక్కన పెడితే అల్లు అర్జున్‌కు సంబంధించిన విషయాలు ఆయన ఎలా చెబుతున్నాడు, అసలు అల్లు అర్జున్‌ జాతకం ఎప్పుడైనా ఆయన చూశాడా అంటూ చర్చ మొదలైంది. మెగా ఫ్యాన్స్‌కు మాత్రం ఈ విషయం సంతోషాన్ని కలిగిస్తుంది. అల్లు అర్జున్‌ ఇప్పటి వరకు ఈ విషయాన్ని గురించి స్పందించలేదు, స్పందిస్తాడన్న నమ్మకం కూడా లేదు.

మరిన్ని వార్తలు

సరైన టైంలో వస్తున్న ‘డీజే’

సుక్కూకు చిర్రెత్తుకు వస్తుందట!