హనుమాన్ చాలీసాకు హాజరైన ముస్లిం మహిళ

kolkata woman thraetened for hanuman chalisa in hijab

కోల్‌కతా: హిజబ్ (బురఖా లాంటి వస్త్రం) ధరించి హనుమాన్ చాలీసా కార్యక్రమానికి వెళ్లినందుకు తనను చంపేస్తామని కొందరు బెదిరిస్తున్నారని పశ్చిమ బెంగాల్ బీజేపీ నాయకురాలు ఇషత్ జహాన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ఇటీవల హిజబ్ ధరించి హౌరాలో ఓ హనుమాన్ చాలీసా కార్యక్రమానికి హాజరయ్యారు. తాను హిందూమత కార్యక్రమానికి వెళ్లానన్న కారణంతో తన భర్త సోదరుడు, ఇంటి యజమాని దుర్భాషలాడుతూ, చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ హౌరాలోని గొలబరి పోలీసు స్టేషన్‌లో ఇషత్ జహాన్ ఫిర్యాదు చేశారు. వందలాది మంది తానుంటున్న ఇంటి వద్దకు వచ్చి తనను బెదిరించారని ఆమె చెప్పారు. హిజబ్ ధరించి హిందూ కార్యక్రమానికి హాజరై ముస్లింలను అవమానపరిచావని వాళ్లు దూషించినట్టు ఆమె తెలిపారు. కుమారుడితో కలిసి నివసిస్తున్న తనకు పోలీసులు రక్షణ కల్పించాలని ఆమె కోరారు. ఇషత్ ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.