Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మహేష్‌బాబు, కొరటాల శివల కాంబినేషన్లో తెరకెక్కిన ‘భరత్ అనే నేను’ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంలో మహేష్‌బాబు సీఎంగా కనిపించబోతున్నాడు. టీజర్, పోస్టర్స్ ఇలా అన్నింటిలో కూడా మహేష్‌బాబు సీఎం అంటూ పబ్లిసిటీ చేశారు. అయితే కొందరు మాత్రం చిత్ర యూనిట్ సభ్యులు పబ్లిసిటీ చేస్తున్నట్లుగా మహేష్‌బాబు సినిమా మొత్తంలో సీఎంగా కనిపించడు అని, కేవలం కొద్ది సమయం మాత్రమే సీఎంగా కనిపిస్తాడని, కాకుంటే సీఎంగా మహేష్‌బాబు అంటే ఎక్కువగా పబ్లిసిటీ వస్తుందనే ఉద్దేశ్యంతో చిత్ర యూనిట్ సభ్యులు మోసం చేసేందుకు ఇలా ప్రచారం చేస్తున్నట్లుగా కొందరు విమర్శలు చేస్తున్నారు.
ఆ విషయమై దర్శకుడు కొరటాల శివ క్లారిటీ ఇచ్చాడు. మహేష్‌బాబు ఈ చిత్రంలో కొద్ది సమయం మాత్రమే సీఎంగా కనిపిస్తాడని మేం చెప్పలేదని, సినిమాలో దాదాపు 75 శాతం సమయంలో మహేష్‌బాబు సీఎంగా కనిపిస్తాడని, మహేష్‌బాబు సీఎంగా ప్రజల కోసం ఎలా పని చేశాడు, అవినీతిపరులైన రాజకీయ నాయకులను ఎలా ఆడుకున్నాడు అనేది సినిమా అంటూ దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. దాంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగినట్లయ్యింది. భారీ అంచనాలున్న ఈ చిత్రంలో హీరోయిన్గా కైరా అద్వానీ నటించింది. మహేష్‌బాబుకు సరిజోడీ అంటూ ఆమె ఇప్పటికే టీజర్ మరియు ట్రైలర్‌తో నిరూపించుకుంది. అయితే సీఎంకు హీరోయిన్‌తో ఎలా రొమాన్స్ సెట్ చేశాడు దర్శకుడు అనే విషయం రేపు సినిమా విడుదల అయితే కాని తెలియదు.