శ్రీరెడ్డి ఆత్మహత్య యత్నం?

Sri Reddy commits suicide

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గత కొన్నాళ్లుగా సంచలనాలకు మారు పేరుగా నిలుస్తున్న శ్రీరెడ్డి నేడు తెల్లవారు జామున ఆత్మహత్యకు ప్రయత్నం చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది. పవన్‌ కళ్యాణ్‌పై ఆమె చేసిన అసభ్యకర వ్యాఖ్యల వెనుక రామ్‌ గోపాల్‌ వర్మ ఉన్నాడని నిన్న వెళ్లడైన విషయం తెల్సిందే. పవన్‌ను తాను ఉద్దేశ పూర్వకంగా తిట్టలేదు అని, తనను ఒక వ్యక్తి ప్రోత్సహించడం వల్ల తిట్టాను అంటూ క్షమాపణలు చెప్పిన శ్రీరెడ్డి వివాదం ముగిసినట్లే అంటూ ప్రకటించింది. అయితే పవన్‌ కళ్యాణ్‌పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసినట్లుగా ఒక ఫోన్‌ కాల్‌ రికార్డింగ్‌లో వెళ్లడైంది. దాంతో ఆమె తీవ్ర మనస్థాపంకు గురై ఆత్యహత్యకు ప్రయత్నం చేసినట్లుగా సమాచారం అందుతుంది.

శ్రీరెడ్డి ఆత్మహత్యకు ప్రయత్నం చేసిన విషయం తెలుసుకున్న మహిళ సంఘం నాయకురాలు ఆమెను ఒక ప్రైవేట్‌ హాస్పిటల్‌లో చేర్పించినట్లుగా తెలుస్తోంది. శ్రీరెడ్డి గత 12 గంటలుగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెట్టక పోవడంకు కారణం అదే అని కొందరు అంటున్నారు. సోషల్‌ మీడియాలో శ్రీరెడ్డి ఆత్మహత్య విషయం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా ఉంది. ప్రస్తుతానికి శ్రీరెడ్డి ఆరోగ్యం బాగానే ఉందని, అయితే ఆమెకు సంబంధించిన పూర్తి వివరాలను వెళ్లడి చేసేందుకు మాత్రం హాస్పిటల్‌ వర్గాల వారు ముందుకు రావడం లేదు. దాంతో శ్రీరెడ్డి ఆత్మహత్య విషయమై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. శ్రీరెడ్డి విషయమై ప్రస్తుతం సినీ వర్గాల్లో మరియు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా ఉన్న నేపథ్యంలో ఆమె ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించడం చర్చనీయాంశం అయ్యింది.