చిరుతో విజయ్‌ని పోల్చిన కోట..!

Kota Srinivasa Rao praised Vijay Devarakonda

‘పెళ్లి చూపులు’ చిత్రంతో హీరోగా మంచి బ్రేక్‌ సాధించిన విజయ్‌ దేవరకొండ ‘అర్జున్‌ రెడ్డి’, ‘గీత గోవిందం’ చిత్రంతో స్టార్‌ హీరో అయ్యాడు. విజయ్‌ దేవరకొండ వాయిస్‌ మరియు ఆయన నటన చాలా సహజంగా ఉంటుందని, ఆయన మన పక్కన ఉన్నట్లుగానే అనిపిస్తుంది. విజయ్‌ నటన నటిస్తున్నట్లుగా కాకుండా, ప్రవర్తిస్తున్నట్లుగా అనిపిస్తుందని ఎంతో మంది చెబుతూ వస్తున్నారు. తాజాగా ప్రముఖ నటుడు, సీనియర్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టు కోట శ్రీనివాస రావు కూడా తాజాగా విజయ్‌ దేవరకొండపై ప్రశంసలు కురిపించాడు. తాజాగా ఒక మీడియా సమావేశంలో కోట మాట్లాడుతూ విజయ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు.

kota

విజయ్‌ దేవరకొండకు మంచి భవిష్యత్తు ఉందని, ఇతడు నటిస్తుంటే నటిస్తున్నట్లుగా కాకుండా బిహేవ్‌ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది అంటూ కోట చెప్పుకొచ్చాడు. ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా వచ్చిన నాని మరియు విజయ్‌ దేవరకొండలు పెద్ద స్టార్‌లు అంటూ కోట పేర్కొన్నాడు. ప్రతి సినిమాలో కూడా వీరిద్దరు తమ సహజ నటనతో మెప్పిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చాడు. గతంలో పలు సార్లు చిరంజీవిపై ప్రశంసల జల్లు కురిపించిన కోట మళ్లీ ఇప్పుడు నాని మరియు విజయ్‌లపై మాత్రమే ప్రశంసలు కురిపించాడు. చిరంజీవి మాదిరిగా స్వతంత్య్రంగా హీరోగా పేరు తెచ్చుకున్న వ్యక్తి విజయ్‌ అని, చిరంజీవి స్థాయిలో విజయ్‌ స్టార్‌ అవుతాడు అంటూ కోట జోష్యం చెప్పాడు. ఇది కేవలం కోట శ్రీనివాసరావు మాట మాత్రమే కాకుండా పలువురు సినీ ప్రముఖులు మరియు సినీ విశ్లేషకులు కూడా ఇదే మాట చెబుతున్నారు.

kotasrinivasarao