‘యూటర్న్‌’కు తలనొప్పిగా మారిన అల్లుడు…!

U Turn Movie Competition On Sailaja Reddy Alludu

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘యూటర్న్‌’ చిత్రాన్ని సెప్టెంబర్‌ 13న విడుదల చేసేందుకు దాదాపు మొత్తం సిద్దం చేశారు. విడుదల ఇంకా 20 రోజులు ఉండగానే పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ను కూడా పూర్తి చేసేశారు. మరో వారం రోజుల్లో ఈ చిత్రం ఫైనల్‌ కాపీని సిద్దం చేసి, సెన్సార్‌ బోర్డు ముందుకు తీసుకు వెళ్లాలని నిర్ణయించారు. కన్నడంలో సూపర్‌ హిట్‌ అయిన ఈ చిత్రం తెలుగులో కూడా తప్పకుండా మంచి విజయాన్ని దక్కించుకుంటుందని, నటిగా సమంతకు ఈ చిత్రం మంచి పేరును తెచ్చి పెడుతుందనే నమ్మకం అందరిలో వ్యక్తం అవుతుంది. ఈ సమయంలోనే యూటర్న్‌ చిత్రంకు పోటీగా శైలజ రెడ్డి అల్లుడు విడుదల కాబోతున్న ప్రచారం జరుగుతుంది.

samantha-silja

ఈనెల 31న విడుదల కావాల్సిన శైలజ రెడ్డి అల్లుడు చిత్రాన్ని రీ రికార్డింగ్‌ వర్క్‌ పూర్తి కానందున వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. రెండు వారాలు ఆలస్యం అంటే సెప్టెంబర్‌ 14న శైలజ రెడ్డి అల్లుడు చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. అంటే సమంత వచ్చిన తర్వాత రోజే శైలజ రెడ్డి అల్లుడు చిత్రాన్ని విడుదల చేయాలని చూస్తున్నారు. సమంత మరియు నాగచైతన్యల మూవీలు ఒక్క రోజు తేడాతో రావడం వల్ల రెండు సినిమాలకు కూడా నష్టం వాటిల్లుతుందని, ఈ చిత్రాల విడుదల కారణంగా ఇద్దరి మద్య ఏదైనా తలనొప్పులు కూడా ప్రారంభం అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి శైలజ రెడ్డి విడుదల ఇప్పుడు పలు చిత్రాలకు ఇబ్బందికరంగా మారింది. మరో వైపు అల్లుడు విడుదల వాయిదా వేయడంతో నాగశౌర్య నర్తనశాలకు కలిసి వచ్చే అంశం. శైలజ రెడ్డి అల్లుడు విడుదల ప్రస్తుతం నాగచైతన్య, సమంతల నిర్ణయంపై ఆధారపడి ఉందని తెలుస్తోంది.

samantha