కొత్తగూడెంలో కుక్కలు.. జనం కనుగుడ్లను పీకేశాయి….

తెలంగాణలోని భ‌ద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో పిచ్చి కుక్కలు స్వైర‌విహారం చేశాయి. అయితే కుక్కకాటుతో సుమారు 10 మంది తీవ్ర‌ గాయాల‌ పాలయ్యారు. వారిలో  ఒక‌రికైతే కనుగుడ్డు తొలిగిపోయిన హృదయ విదారకమైన ఘటన చోటుచేసుకుంది.  అందుకు సంబంధించిన ఘటన వివరాల్లోకి వెళ్తే.. భ‌ద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుప‌ల్లి మండ‌లం సింగ‌రేణి కార్మిక‌ ప్రాంత‌మైన‌ రుద్రంపూర్ తండాలో పిచ్చికుక్కల‌ స్వైర‌ విహారం చేశాయి. దీంతో జనం ఒక్కసారిగా తీవ్ర భ‌యాందోళనకు గురయ్యారు. ఎందుకు చేశాయో ఏమో కానీ.. దొరికిన‌ వారిని దొరికిన‌ట్లు జనాలపై పడి దాడి చేయడంతో జనాలు పరుగులు తీశారు. తీవ్రమైన భయానికి లోనయ్యారు.

అదేవిధంగా దొరికిన జనాలను ఎక్కడ పడితే అక్కడ కొరికేసి తీవ్రమైన గందరగోళం సృష్టించాయి. వీరాస్వామి అనే వ్యక్తికి ఏకంగా క‌నుగుడ్డు పీక‌టంతో వెంటనే అతనిని యంజియం ఆసుపత్రికి త‌ర‌లించారు. మిగ‌తావారికి తీవ్ర గాయాల‌య్యాయి. దీంతో వారిని హుటాహుటిన‌ కొత్త గూడెం ప్రభుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు. కాగా పిచ్చి కుక్కల‌ స్వైర‌విహారంతో స్థానికులు ఎంతో హ‌డ‌లిపోయారు. కొందరు  స్థానికులు రాళ్లుతీసుకొని వెంబ‌డించి మరీ జ‌నంపై దాడి చేసిన‌ కుక్కలను కొన్నింటిని చంపి వేశారు. అయితే కుక్కల స‌మ‌స్య చాలా తీవ్రంగా ఉందని, సింగ‌రేణి అధికారుల‌ ద‌ృష్టికి తీసుకెళ్ళినప్పటికీ స్పందించ‌డం లేద‌ని ఆ గ్రామ స‌ర్పంచ్ రామ‌స్వామి వెల్లడించారు. ఇప్పటికైనా కుక్కలపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటున్నారో చెప్పాలని ఆయన డిమాడ్ చేశారు.