కొత్త గూడెం డీఎస్పీ కుమారుడికి కరోనా పాజిటివ్

కొత్త గూడెం డీఎస్పీ కుమారుడికి కరోనా పాజిటివ్

ఇటీవలే లండన్ నుంచి వచ్చిన భద్రాద్రి కొత్త గూడెం డీఎస్పీ కుమారుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. అతడిని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఐసోలేషన్ లో ఉంచి చికిత్స చేస్తున్నారు. ఇక డీఎస్పీ కుటుంబ సభ్యులందరికీ పరీక్షలు చేశారు. వారందర్ని క్వారంటైన్ కు తరలించారు.

డీఎస్పీ కుమారుడు లండన్ లో ఎంఎస్  చేస్తున్నారు. ఈనెల 18న భద్రాద్రికి వచ్చాడు. దగ్గు జ్వరంతో బాధపడుతుండడంతో కరోనా వైరస్ సోకినట్టు అనుమానించి ప్రత్యేక అంబులెన్స్ లో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు.18న లండన్ నుంచి వచ్చిన కొత్త గూడెం యువకుడు అంతకుముందు ఎవరెవరిని కలిశాడన్నది అదికారులు ఆరా తీస్తున్నారు. వారందరికీ వైద్య పరీక్షలు చేసి క్వారంటైన్ లో ఉండాల్సిందిగా అధికారులు కోరుతున్నారు.

కరోనా వైరస్ సోకిన తన కుమారుడికి డీఎస్పీ గన్ మెన్లతో సేవలు చేయించాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు వీడియోలు వైరల్ అయ్యాయి. ముఖానికి మాస్క్ మాత్రమే ఉన్న గన్ మెన్లకు కూడా కరోనా సోకవచ్చన్న అనుమానం కలుగుతోంది. డీఎస్పీ గన్ మెన్లను వారి కుటుంబ సభ్యులను వరంగల్ ఆస్పత్రికి తరలించి క్వారంటైన్ లో ఉంచారు. గన్ మెన్లతో కరోనా సోకిన కుమారుడికి సేవలు చేయించిన డీఎస్పీ తీరుపై విమర్శలు చెలరేగుతున్నాయి.