రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇంట్లో గత 25ఏళ్లుగా పనిచేస్తున్న పద్మ అనే మహిళను కృష్ణంరాజు కుటుంబం ఘనంగా సన్మానించింది. 25 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అంటూ ఆమెతో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలును కృష్ణంరాజు కూతురు ప్రసీద సోషల్‌మీడియాలో షేర్‌చేసుకుంది. 25 ఏళ్లుగా మాకోసం చాలా చేశారు. థ్యాంక్యూ పద్మ ఆంటీ అంటూ కృతఙ్ఞతలు తెలిపారు.
అంతేకాకుండా ఈ సందర్భంగా కృష్ణం రాజు సతీమణి శ్యామలా దేవి ఆమెకు ఓ బంగారు గొలుసును కూడా కానుకగా ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఇంట్లో పనిచేసే మహిళను కూడా ఇంట్లో మనిషిగా చేసుకోవడం నిజంగా గ్రేట్ అంటూ కృష్ణంరాజు దంపతులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్ సినిమాను వంశీ, ప్రమోద్‌లతో కలిసి ప్రసీద నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 14న విడుదల కానుంది.