ఒకప్పుడు ఐస్ బకెట్ ఛాలెంజ్ అంటూ వచ్చింది. ఆ ఛాలెంజ్‌కు ప్రపంచ వ్యాప్తంగా విశేషమైన ఆధరణ దక్కింది. చిన్నా పెద్దా, ముసలి ముతకా, సెలబ్రెటీ, సామాన్యులు ఇలా అంతా కూడా ఆ ఛాలెంజ్‌ను స్వీకరించి, ఇతరుకు ఛాలెంజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎన్నో ఛాలెంజ్‌లు వస్తున్నాjయి, పోతూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం ప్రచారం కోసం మంత్రి కేటీఆర్ గ్రీన్ ఛాలెంజ్ అంటూ ప్రారంభించారు. సినీ మరియు రాజకీయ, వ్యాపార ప్రముఖులను ఇందులో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశ్యంతో ఆయన ఈ ఛాలెంజ్‌ను చేయడం జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఈ ఛాలెంజ్‌ను స్వీకరించారు.
మహేష్‌బాబు మొదటగా ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కను నాటి, ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన కొడుకు గౌతమ్, కూతురు సితారలతో పాటు ప్రస్తుతం తాను నటిస్తున్న సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లికి ఛాలెంజ్ చేశాడు. ఈ ముగ్గురు చెట్లు నాటి వారు మళ్లీ ఇతరులకు ఛాలెంజ్ చేయాల్సి ఉంటుంది. ఇక చిరంజీవి కూడా గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించాడు. తన గార్డెన్ ఏరియాలో చెట్టును నాటి, తనవంతుగా ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావుకు, పవన్ కళ్యాణ్‌కు ఛాలెంజ్ చేయడం జరిగింది. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ముందు ముందు మరింత మంది ఈ గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొంటారు. మొత్తానికి కేటీఆర్ చేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుంది. సెలబ్రెటీలు మాత్రమే కాకుండా సామాన్యులు కూడా చెట్లు నాటి ఛాలెంజ్ చేసుకోవాలని కొందరు భావిస్తున్నారు. మొత్తానికి తెలంగాణ హరితహారంకు మంచి పబ్లిసిటీ దక్కింది. కేటీఆర్ చేసిన సవాల్‌ను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా స్వీకరించిన విషయం తెల్సిందే.