దేశం, రాష్ట్రమంతా కామారెడ్డి వైపు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. 2004లో పొత్తులో భాగంగా కామారెడ్డి సెగ్మెంట్ కాంగ్రెస్కు అవకాశం కల్పించింది. కేసీఆర్ ప్రచారం చేస్తేనే షబ్బీర్ అలీ గెలిచారు. కామారెడ్డితో ఉన్న అనుబంధం తోనే కేసీఆర్ ఇక్కడ పోటీ చేస్తున్నారు. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా ఒక దృఢమైన ఆశయం ఉంటది. కరువును తరిమి కొట్టేందుకే ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు కేసీఆర్.
ముఖ్యంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుండి బరిలోకి దిగేందుకు సీఎం కేసీఆర్ ఎంచుకున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. కామారెడ్డి డిగ్రీ కళాశాల మైదానంలో మినీ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన మంత్రి కేటీఆర్ చేశారు. ఈ నియోజకవర్గం ఉద్యమ స్పూర్తిని తెచ్చిందని పొత్తులో భాగంగా 2004లో కామారెడ్డి నియోజకవర్గాన్ని తీసుకున్నామని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీలోకి గంప గోవర్దన్ రావడంతో బలం మరింత పెరిగిందన్న కేటీఆర్ అన్నారు. గంప గోవర్దన్ విజ్ఞప్తి మేరకే కేసీఆర్ కామారెడ్డి నుంచి బరిలోకి దిగుతున్నట్టు మంత్రి కేటీఆర్ చెప్పారు .