బస్తీ దవఖానాలపై కేటీఆర్ సమీక్ష

బస్తీ దవఖానాలపై కేటీఆర్ సమీక్ష

బస్తీ దవఖానాలపై మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. పేదలకు ప్రాథమిక ఆరోగ్యం అందడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేసిన మంత్రి.. హైదరాబాద్‌లో మరో 100 బస్తీ దవాఖానాలుల ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బస్తీ దవాఖానాల ద్వారా ప్రతి రోజు 25 వేల మందికి వైద్య సేవలు అందిస్తున్నామని, కొత్తగా నిర్మించబోయే దవాఖానాలు త్వరగా పూర్తి చేయాలని అధికారుకు సూచించారు. ప్రజారోగ్యాన్ని కాపాడడంలో బస్తీ దవాఖానాలు విజయవంతం అయ్యాయని సిబ్బందిని ప్రశంసించారు.

హైదరాబాద్ పరిధిలోని 197 బస్తి దావఖానాలు, ఇతర నగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రతి రోజు 5000 పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.ప్రతి రోజు 53 రకాల పాథాలజీ, మైక్రోబయాలకీ, బయో కెమిస్ర్టీ వంటి వైద్య పరీక్షలు చేస్తున్నామని కేటీఆర్‌ స్పష్టం చేశారు. బస్తి దవాఖానాలకు పేదల నుంచి మంచి స్పందన వస్తుందని, ముందుముందు వీటిని మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ వాకాటి కరుణ, జిల్లాల కలెక్టర్లు, పురపాలక శాఖ, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.