పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రాజెక్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టి వేయడంపై టీపీసీసీ అధ్యక్షుడు (TPCC Chief) మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలతో తాను దిగ్భ్రాంతి చెందానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఇది సుప్రీంకోర్టును మాత్రమే కాదు.. భారత రాజ్యాంగాన్ని కూడా కించపరచడమేనని, రాజకీయ ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టు తీర్పులపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేయడం దురదృష్టకరమని అన్నారు. మీ నాయకులకు దేశ న్యాయ వ్యవస్థ పట్ల గౌరవం లేనప్పుడు రాజ్యాంగ కాపీతో “న్యాయ్ యాత్రలు” చేయలేరని కేటీఆర్ అన్నారు.