కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో వివాదంలో చిక్కుకున్నారు. గతంలోనూ ఆయన ఢిల్లీ విశ్వవిద్యాలయంలో అనుమతి లేకుండా సందర్శనలు చేసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఈసారి కూడా, రాహుల్ గాంధీ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా గురువారం మే 22న DUSUకు వెళ్లారు. ఈ సంఘటనలపై విశ్వవిద్యాలయం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకూడదని, ఇలా జరిగితే సంబంధిత విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.