ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసిన లేఖ తీవ్ర కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఈరోజు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. అంతర్గత విషయాలను బయట మాట్లాడటం సరికాదన్నారు. అంతర్గత విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే మంచిదని చెప్పుకొచ్చారు. కవిత లేఖ పెద్ద విషయం కాదని కొట్టిపారేశారు. పార్టీలో అందరం కార్యకర్తలమే అని.. అందరం సమానమే అని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువన్నారు. కేసీఆర్‌కు లేఖలు రాయడం సహజమే అని.. కేసీఆర్‌కు సూచనలు చేయాలంటే ఎవరైనా లేఖలు రాయొచ్చు అని మాజీ మంత్రి అన్నారు.