తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ తీవ్ర దుమారం రేపుతోంది. బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్‌కు కవిత రాసిన లేఖపై అధికార పార్టీ నేతలు స్పందిస్తూ.. ఇదంతా డ్రామా అంటూ వ్యాఖ్యలు చేశారు. అలాగే కాంగ్రెస్‌పై కేటీఆర్ చేస్తున్న ఆరోపణలపై కూడా మండిపడుతున్నారు. తాజాగా కేటీఆర్ కామెంట్స్‌పై మంత్రి సీతక్క స్పందించారు. సిస్టర్ స్ట్రోక్‌తో కేటీఆర్‌కు చిన్న మెదడు చితికిపోయిందంటూ ఎద్దేవా చేశారు. కాళేశ్వరంలో కమీషన్ తీసుకున్నప్పుడు లేని భయం.. కమిషన్ ముందుకు రావడానికి ఎందుకు అని ప్రశ్నించారు. గ్లోబెల్స్ ప్రచారంలో కేటీఆర్‌ను మించిన వారు లేరని, కేటీఆర్‌కు గ్లోబెల్ అవార్డు ఇవ్వాలని కామెంట్స్ చేశారు. అబద్దాల పునాదులపై బీఆర్ఎస్ నడుస్తోందని విమర్శించారు.