కూలింగ్‌ అండ్‌ కోల్డ్‌ చైన్‌ కేంద్రాన్ని ప్రారంభించిన కేటీఆర్‌.

Telangana Center of Excellence Cooling and Cold Chain
Telangana Center of Excellence Cooling and Cold Chain

హైదరాబాద్‌ ఫార్మా రంగానికి క్యాపిటల్‌గా మారిందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. నగరం నుంచే ప్రపంచానికి వ్యాక్సిన్లు సరఫరా చేస్తున్నామని చెప్పారు. జీఎంఆర్‌ ఇన్నోవేక్స్‌ సెంటర్‌లో ‘తెలంగాణ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ కూలింగ్‌ అండ్‌ కోల్డ్‌ చైన్‌’ కేంద్రాన్ని శంషాబాద్‌ విమానాశ్రయంలో కేటీఆర్‌ ప్రారంభించారు. ప్రపంచంలో దేనిని ఆపగలిగినా.. వ్యవసాయ రంగాన్ని మాత్రం ఆపలేమని సీఎం కేసీఆర్ ఎప్పుడూ చెప్తుంటారని కేటీఆర్ తెలిపారు. ఈ తొమ్మిదేళ్లలో వ్యవసాయరంగ ఉత్పత్తి, ఎగుమతులు ఎంతో పెరిగాయని కేటీఆర్ వెల్లడించారు. ఇటువంటి కూలింగ్‌ సొల్యూషన్స్‌ మనకు దేశంలో ఇంకా కావాలని అన్నారు. రైతులు పండించే ఆహార పదార్థాలు భద్రపరిచేందుకు కూడా ఈ కేంద్రం ఉపయోగపడుతుందని కేటీఆర్ పేర్కొన్నారు.