కుమారి ఆంటీ…. యూటూబ్ ఫుడ్ వ్లాగర్స్ పుణ్యమా అని ఈ పేరు ఈ మధ్యన సోషల్ మీడియాలో విపరీతంగా మారుమోగుతుంది.మీది మెుత్తం 1000 అయింది. రెండు లివర్లు ఎక్స్ట్రా’ అని అంటూ తెగ వైరల్ అయింది. సోషల్ మీడియాలో ఫుడ్ సెంటర్ వైరల్ కావడంతో పెద్ద ఎత్తున జనాలు ఆమె వద్దకు వెళ్తున్నారు .
ఇక ఈ క్రేజ్ తో టీవీలో కూడా ఎంట్రీ ఇచ్చారు కుమారి ఆంటీ. ప్రస్తుతం తెలుగులో ప్రసారం అవుతున్న ప్రముఖ టీవీ షోలలో అన్నింటిలో కనిపించేశారు కుమారి ఆంటీ. ఇక షో లు అన్ని కవర్ అవ్వడంతో సీరియల్ లోకి ఎంట్రీ కూడా ఇచ్చారు .తాజాగా జీ తెలుగులో ప్రసారమవుతున్న రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ ….సీరియల్ లో స్పెషల్ గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చి అందరిని ఆశ్చర్యాన్ని గురి చేసింది.త్వరలో ప్రసారంకానున్న ఈ ఎపిసోడ్ కు సంబందించిన ప్రోమో ని రిలీజ్ చేశారు. ప్రోమోలో కుమారి ఆంటీ ను చూసి అవాక్కు అవుతున్నారు .అంతే కాకుండా కుమారి ఆంటీతో మామూలుగా ఉండదు, కుమారి ఆంటీ నా మజాకా అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం కుమారి ఆంటీ కనిపించిన ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.