చంద్రయాన్-3లో జోగులాంబ గద్వాల జిల్లాకు అరుదైన గౌరవం దక్కింది. చంద్రయాన్ 3 లో జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలానికి చెందిన కృష్ణ కుమ్మరి అనే యువకుడు భాగం అయ్యాడు. పదవ తరగతి ( 2008 ) వరకు ఉండవెల్లి మండలంలో జడ్పీ పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలానికి చెందిన కృష్ణ కుమ్మరి.
2011 నుంచి 2014 వరకు తిరుపతిలో డిప్లమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్సు చేశాడు. అనంతరం టేరా డేటా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇండియా డెవలప్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు మూడున్నర సంవత్సరాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేశాడు.ఒకవైపు ఉద్యోగం చేస్తూనే , ఆల్ ఇండియాలో ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ పరీక్ష రాసి నాలుగో స్థానం సంపాదించాడు. 2018 నుంచి చంద్రయాన్ 3 లో అనేక సంస్థలు పనిచేస్తాయి అందులో ఎల్ హెచ్ వి సి , ఐ ఎల్ ఎస్ ఏ కు కృష్ణ కుమ్మరి డేటా ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ గా పనిచేస్తున్నాడు.