Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
L Ramana vs Revanth Reddy In TTDP Presidential Race In Telangana
మొన్న జరిగిన విశాఖ మహానాడులో టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో కొన్ని రోజుల్లో రాష్ట్రాల అధ్యక్షుల్ని ప్రకటిస్తారని అంతా అనుకున్నారు. కానీ ఇంతవరకూ వారి నియామకం జరగలేదు. అయితే ఇవాళో, రేపో అధికారిక ప్రకటన వస్తుందని చెబుతున్నాయి టీడీపీ వర్గాలు. రెండు రాష్ట్రాల్లో రెండు ప్రత్యేక సందర్భాలు కావడంతో.. అధ్యక్షుల నియామకానికి జాప్యం జరిగిందట.
ఏపీ విషయానికొస్తే.. అక్కడ జిల్లాల పంచాయితీలు నడిచి.. జిల్లా అధ్యక్షుల ఎంపిక కాస్త ఆలస్యమైంది. చివరకు అధినేత జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు వివాదాలు సద్దుమణగడంతో.. ఇక రాష్ట్ర పార్టీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. ఇప్పటికే అధినేత దగ్గర మంచి మార్కులు కొట్టేసిన కళా వెంకట్రావే మరోసారి కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయనకు అంతగా పనిలేని విద్యుత్ శాఖను కూడా అందుకే అప్పగించారని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. విద్యుత్ శాఖను సీఎం ఇప్పటిదాకా నిర్వహించి సెట్ రైట్ చేయడంతో.. కళా పూర్తిగా పాలిటిక్స్ పై ఫోకస్ చేయగలుగుతున్నారు.
ఇక తెలంగాణలో ప్రతిపక్షంగా ఉన్న టీడీపీకి ప్రస్తుతం ఎల్.రమణ, రేవంత్ జోడీ బాగానే వర్కవుట్ అవుతోంది. రేవంత్ దూకుడ్ని రమణ బ్యాలెన్స్ చేయడంతో బాబు పని తేలికవుతోంది. సీనియర్లు రేవంత్ పై మండిపడినా.. ఎప్పటికప్పుడు రమణ వారిని సముదాయిస్తున్నారు. దీంతో మరోసారి ఇదే జోడీని కంటిన్యూ చేయాలనేది బాబు అభిప్రాయమట. అన్నీ అనుకున్నట్లు జరిగితే రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీకి పాతకాపులే మళ్లీ అధ్యక్షులవడం ఖాయమే.
మరిన్ని వార్తలు: