అమ్మ గెస్ట్ హౌస్ లో అస్థిపంజరం

Skeleton At Jayalalithaa's Guesthouse

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 Skeleton At Jayalalithaa’s Guesthouse

తమిళనాడులో అమ్మ ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ జరగని సిత్రాలు.. ఆమె చనిపోయాక జరుగుతున్నాయి. రోజుకో చోట జయలలిత ఆత్మ తిరుగుతుందని, ఆమె ఆస్తుల దగ్గర తేడా జరిగితే చంపేస్తుందని పుకార్లు తెరపైకి వచ్చాయి. అమ్మ మూఢభక్తికి కొదువలేని తంబీలు ఈ ప్రచారాన్ని భుజాన వేసుకుని మోస్తున్నారని అందరూ అనుకున్నారు. కానీ జయ గెస్ట్ హౌస్ వద్ద నిజంగానే అస్థిపంజరం కనిపించడంతో.. ఈ పుకార్లకు ఊతం లభించింది.

సిరుతాపూర్ బంగ్లాను జయ గెస్ట్ హౌస్ గా వాడేవారు. ఇక్కడే కీలక ఆస్తి పత్రాలున్నాయనేది స్థానికుల మాట. అమ్మ చనిపోగానే ఈ బంగ్లాలో అగ్నిప్రమాదం జరగడంతో అనుమానాలు బలపడ్డాయి. ఉన్నట్లుండి అస్థిపంజరం కనిపించడంతో ఆస్తి గొడవలే కారణమై ఉంటాయనేది పోలీసుల మాట. జయ మరణం తర్వాత కొడనాడు, సిరుతాపూర్, పోయెస్ గార్డెన్ లో పోలీస్ భద్రత తగ్గించడం కూడా వీరికి కలిసొచ్చింది.

ప్రస్తుతం సిరుతాపూర్ బంగ్లా దినకరన్, శశికళ కుటుంబీకుల ఆధీనంలో ఉంది. వీరే ఏదో కిరికిరి చేశారనేది స్థానికుల మాట. తమిళనాడు అంతా జయకు మంచి పేరు ఉన్నా.. శశికళను మాత్రం అన్నిచోట్లా చీదరించుకుంటున్నారు. అలాంటి సమయంలో బయటపడ్డ అస్థిపంజరం చిన్నమ్మ తొండాటను మళ్లీ గుర్తుచేస్తోందని పోలీసులు కూడా అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు